
Rajamouli : ప్రపంచవ్యాప్తంగా పేరు తేవడమే కాకుండా.. ఆస్కార్ అవార్డును తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రాజమౌళి ఒక ప్రాజెక్టును ఓకే చెప్పాడు అంటే దాని అర్థం ఇంక అది ఎక్కడికో ( Rajamouli was assistent director for Mahesh movie ) తారాస్థాయి సక్సెస్ఫుల్ కి వెళ్లడానికి సిద్ధం అయిపోయిందని.. అలాంటి కథ, అలాంటి కథనం, అలా తీయగలను అనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉన్న తర్వాతే ఆయన ఓకే చెప్తాడు. నిజంగా ఇలాంటి దర్శకుడు దొరకడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినీ అభిమానులకి, తెలుగు హీరోలకి, నటీనటులకి అందరికీ అదృష్టమే.
తాను చేసే పనిని దైవంగా పూజించే రాజమౌళిని చూసి ప్రతి మనిషి ఇన్స్పైర్ అయి తీరాలి.. అంటే అందరూ దర్శకులు అవ్వాలని కాదు.. ఎవరి పనిలో వాళ్ళు పనికింత విలువ ఉందా? పనిచేస్తూ ఉంటేనే, పని గురించి ఆలోచిస్తేనే ఇంత ఫలితం ఉంటుందా? అని ఆలోచించి తీరాలి. ఆలోచించడమే కాకుండా ఆచరణలో కూడా పెట్టుకోవాలి. అప్పుడే ( Rajamouli was assistent director for Mahesh movie ) అలాంటి మహానుభావులు మన చుట్టూ ఉన్నదానికి ఫలితం ఉంటుంది. అయితే రాజమౌళి కెరీర్లో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ చూడని దర్శకుడు అంటే ఆయనే చెప్పాలి. ఇంతవరకు ఏ సినిమా కూడా డిజాస్టర్ గా మిగలలేదు. ఆయన చరిత్రలో ఇకమీదట కూడా ఉండదని అందరూ అనుకుంటున్నారు. అలాంటి తరుణంలో ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఆయన సినిమా చేస్తుంటే.. మహేష్ బాబు అభిమానుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.
అయితే మహేష్ బాబుతో ఆయన చేస్తున్నది ఇది మొదటి సినిమా కాదు. దర్శకుడుగా ఆయన చేస్తున్నది మొదటి సినిమానే కావచ్చు.. కానీ మహేష్ బాబుతో రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడా? ఎప్పుడు ఆయన మొదటి సినిమా అంటే అందరికీ తెలిసింది. జూనియర్ ( Rajamouli was assistent director for Mahesh movie ) ఎన్టీఆర్ తో కలిసి చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ ఈ సినిమాకి మొదటిసారిగా ఆయన దర్శకత్వం వహించి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు. తెలుగు సినిమా అభిమానులందరికీ రాజమౌళి అంటే తెలిసింది అప్పటినుంచే కానీ.. ఆయన మహేష్ బాబు నటించిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ సినిమా కంటే ముందే చేశాడంట. ఆ విషయం ఇటీవలనే దర్శకుడు రాఘవేంద్రరావు గారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, ప్రీతిజింట హీరోయిన్గా, ప్రకాష్ రాజ్, సుమలత మొదలగువారు ముఖ్య పాత్రలు పోషించి.. 1999లో విడుదలైన చిత్రం రాజకుమారుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ బద్దలకొట్టింది. విపరీతమైన ఘన విజయాలతో కలెక్షన్ రాబట్టింది దర్శకుడుగానే కాదు.. రాజమౌళి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ని కొట్టింది. అదే ఆయన గొప్పతనం ఈ విషయం చాలామందికి ఇప్పటివరకు తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా కే. రాఘవేంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పుకొచ్చారు. రాజకుమారుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా రాజమౌళి చేసిన తర్వాతనే.. ఆయన దర్శకుడుగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదటి సినిమా మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి మహేష్ బాబు, రాజమౌళి కాంబో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా కూడా హిట్టే..