Rajamouli comments on Junior NTR: రాజమౌళి అనే పేరు తెలియని వారు ఉండరు, అతను సాధించిన విజయాలు గురించి ఎరుగని వాళ్ళు ఉండరు. కానీ, అసలు రాజమౌళి సినిమా కెరియర్ ఎక్కడ నుంచి ఎలా మొదలయ్యింది అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అయితే ఆ మనిషి పేరు విజయాలు అందరికీ తెలుస్తాయి, అందరూ వాటి గురించి మాట్లాడుకుంటారు. అదే ఒక మనిషి ఫెల్యూర్ లో ఉంటె తన గురించి ఎవరికీ ఏమీ అక్కరలేదు, ఎవరికీ ఏమి తెలియదు కూడా. ఈ ఫెల్యూర్ లో ఉన్న మనిషికి మాత్రం ప్రపంచం గురించి బాగా తెలుస్తాది. ఎందుకంటే అప్పుడే కదా ప్రపంచం తన నిజస్వరూపాన్ని చూపిస్తాది.
రాజమౌళి (Rajamouli comments on Junior NTR )కెరియర్ ఒక సీరియల్ తో మొదలయ్యింది. శాంతినివాసం అనే సీరియల్ కి రాజమౌళి మొదట దర్శకత్వం చేశారు. ఈ సీరియల్ అప్పట్లో చాల హిట్ అయ్యింది. ఆ తరవాత రాజమౌళి కి సినిమా దర్శకత్వం చేసే ఆఫర్ వచ్చింది. ఇంతకీ రాజమౌళి మొదట సినిమాకి హీరో ఎవరో తెలుసా? మీలో చాలామందికి తెలిసే ఉంటాది. రాజమౌళి మొదటి సినిమాకి హీరో జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ వన్ సినిమా మొదట వీళ్ళిద్దరిని కలిపింది. విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాదో, ఎందుకు కలుపుతాదో, ఆ కలయిక మంచికో, చెడుకో, ఒక సెన్సేషన్ కో దేనికో కలిసినప్పుడు తెలీదు. ఆ రోజు వీళ్లిద్దరికీ ఫ్యూచర్ లో వీళ్లిద్దరు ఎలాంటి రేంజ్ లో ఉంటారో ఊహించి కూడా ఉండరు.
స్టూడెంట్ నంబర్ వన్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ వయసు చాలా తక్కువ. మీసం కూడా సరిగ్గా రాని కుర్రాడు. ఇక రాజమౌళి చూస్తే.. సీరియల్ అనుభవం తప్ప డైరెక్టర్ గా సినిమాకి దర్శకత్వం చెయ్యడం అదే మొదలు. కానీ ఆ సినిమాలో పాటలా ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అన్నట్టు వీళ్ళిద్దరూ సినిమా తల్లి నీడలో కలిశారు. అవకాశలకోసం అదృష్టం కోసం వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఇద్దరూ ఉన్నారు. అలా ఆకలితో మొదలైన ఈ సింహాలు, సినిమా ఇండస్ట్రీ లో తిరుగులేని రారాజులు అయ్యారు. అయితే రాజమౌళి ఎన్టీఆర్ గురించి మొదట చూసినప్పుడు ఏమనుకున్నాడో అనే దానిపై ఒక సమాచారం వైరల్ అవుతుంది. అది చూసి ఎన్టీఆర్ ఫాన్స్ మండి పడతున్నారు. ఇక ఎన్టీఆర్ వైఫ్ రాజమౌళి పై ఎంత మండి పడతాదో అనుకుంటున్నారు.
రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ స్పాట్ లోనే ఎన్టీఆర్ ని ఫస్ట్ టైం చూసాడంట. చూసిన వెంటనే.. ఆమ్మో వీడెంటి ఇలా ఉన్నాడు అనుకున్నాడంట. బొద్దుగా ఉన్నడేంటి? పైగా అలా నడుస్తున్నాడేంటి? నా ఖర్మ కాకపోతే ఇలాంటి వాడితో నా మొదటి సినిమా ఏంటి అనుకున్నడంట. సర్లే స్టార్ హీరోలతో సినిమా చేసి హిట్ కొడితే, నా ప్రతిభ ఎలా తెలుస్తాది? ఇలాంటి గుడ్డి గుర్రంతో రేసులోకి వెళ్లి, గెలిస్తేనే మన సత్తా అందరికి తెలుస్తాదని అనుకున్నాడంట. ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ హర్ట్ అవుతుంటే, మరి గుడ్డి గుర్రం అన్నందుకు ఎన్టీఆర్ వైఫ్ రాజమౌళి మీద ఎలాంటి కోపం చూపిస్తాదో మరి.. అయితే పాపం రాజమౌళి మొదట అలా అనుకున్నా, ఎన్టీఆర్ కి పెద్ద పెద్ద హిట్స్ ఇవ్వడమే కాకూండా ఎన్నో సార్లు తనకు ఇష్టమైన ట్యాలెంట్ ఉన్న హీరో అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు.