Pushpa 3: ఇంతక ముందు పార్ట్ 1 పార్ట్ 2 అంటూ హాలీవుడ్ లోనే సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఒకే సబ్జెక్టు ను పట్టుకుని కొంచెం ఎక్కువగా రాసుకుని.. ప్రొడ్యూసర్ ని హీరో ని ఒప్పించగలిగితే.. అక్కడ నుంచి కనీసం రెండు మూడు ( Pushpa 3 onboard director Sukumar gives a hint to fans ) సంవత్సరాలు ఆ ప్రోజక్ట్ లో అందరికి పని దొరుకుతాది కనుక ఈ ఆలోచన కూడా మంచిదే. అదే జక్కన్న అయితె రెండు సినిమాలకి 6 ఏళ్ళు నడుస్తాది. ఇప్పటి వరకు బాహుబలి, కెజిఎఫ్ రెండు భాగాలుగా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కాయి. అదే దారిలో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప కూడా నడిచింది.
బాహుబలి రెండువ పార్ట్ అయిన తరవాత మూడవ పార్ట్ వస్తాదా అంటూ అనేక చర్చలు జరిగాయి కానీ, అలాంటి ఆలోచన అయితే ఏమి కనబడలేదు. పైగా ఆ కథని రెండవ పార్ట్ తో ముగించేసినట్టు క్లారిటీ కూడా వచ్చేసింది. మొదటి భాగం పూర్తి అయ్యేటప్పటికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న వదిలి రెండవ సినిమా దానికి సమాధానంతో పాటు దానికి రివెంజ్ కూడా తీర్చేసాడు. ఇప్పుడు ( Pushpa 3 onboard director Sukumar gives a hint to fans ) పుష్ప లో.. విలన్ కి ఎండింగ్ లో వార్నింగ్ ఇచ్చి.. సవాల్ విసిరి.. హీరోయిన్ తో పెళ్లి చేసుకుని కొత్త కోణాన్ని మొదలెట్టించాడు. అసలు ఆ కోణం ఎలా ఉంటాదో సెకండ్ పార్ట్ లో చూపిస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే.. ట్రైలర్ మొదలు పుష్ప బ్రతికే ఉన్నాడా అంటూ మొదలు పెట్టాడు. పైగా అతని కోసం ప్రజలు పోరాటం కూడా చూపించాడు. అంటే పుష్ప 2 లో విలన్ పోలీస్ ఆఫీసర్ పుష్ప పై ఎలాంటి రివెంజ్ మొదలు పెడతాడో చూపించాలి. అల్లు అర్జున్ పెళ్లి తరవాత రొమాంటిక్ జీవితం చూపించాలి. తరవాత అసలు పుష్ప అంతమంది ప్రజలకు దేవుడు అయ్యాడంటే.. ఎలా అయ్యాడో, అంత డబ్బు ఎలా సంపాదించాడో, అసలు ప్రజలను అలా ఆదుకోవాలని ఎందుకు అనుకున్నాడో క్లారిటీ ఇవ్వాలి. ఇవన్నీ పార్ట్ 2 లో సుకుమార్ క్లారిటీ ఇవ్వగలడు అనుకుందాం. అక్కడితో సుకుమార్ ఆగలేదు. పుష్ప ని అమ్మవారి గెటప్ లో చూపించాడు.
అంటే అసలు అమ్మవారి అవతారమే ఎందుకు ఎత్తాడు? అనే ప్రశ్నకి పుష్ప భార్యని చంపడం వలన తనలో ఆమెను సగ భాగం చేసుకుని, విలన్స్ ని చంపుతాడు అని కొందరు అంటున్నారు. పోనీ ఆకోణం లో ఆలోచించినా కూడా.. ఇన్నిటికి సినిమా లెన్త్ సరిపోదు. పైగా సుకుమార్ లాంటి దర్శకుడు ఒక సినిమాలో హీరోని ఒక కోణంలోనే పర్ఫెక్ట్ చూపించడానికి నిదానంగా చూస్తాడు తప్ప హడిబిడిగా ఒకే హీరోతో ఎక్కువ కథ, ఎక్కువ కోణాలు చూపించడు. అందుకే పుష్ప 1 లో పుష్ప కేరక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసాడు. పుష్ప 2 లో అసలు పుష్ప ఎందుకు ఆలా స్మగ్లింగ్ దారిని వెతుక్కున్నాడో ఎక్కువగా గతాన్ని చూపించి..పుష్ప 3 లో నెక్స్ట్ విలన్స్ అంతు ఎలా తేలుస్తాడో చూపిస్తానని అమ్మవారి గెటప్ ఇంట్రడక్షన్ ఇచ్చి.. రెండవ పార్ట్ ముగించవచ్చు . ఇలా మనకు మనకు ఊహించుకోవడమే కాకుండా మూడవ పార్ట్ తీసే ఉద్దేశం లో సుకుమార్ కి ఉందంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ వార్త ఎంతవరకు నిజమో చూడాలి..