Home Cinema Prabhas: ఆ డైరెక్టర్ ప్రభాస్ ని అవమానించడానికి కారణం అదేనా.. 3000 కోట్లా!

Prabhas: ఆ డైరెక్టర్ ప్రభాస్ ని అవమానించడానికి కారణం అదేనా.. 3000 కోట్లా!

Prabhas insulted by that famous director: బాహుబలి సినిమాతో ఊహించని స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్న ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు. ప్రభాస్ మొదట్లో ఎదో అలా నిమ్మదిగా సక్సెస్ అయ్యే హీరోలా అనిపించినా, తరవాత మంచి దర్శకుల హ్యాండ్ లో పడి చాలా మంచి పోజీషన్ కి వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. తనకు నెక్స్ట్ చెయ్యబోయే మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు భారీ అంచనాలే వేసుకుంటున్నారు.సినిమాని సింపుల్ సినిమాలా చూడకుండా పెద్ద ప్రాజెక్టు లా చూస్తున్నారు. అందుకే బడ్జెట్, రాబడి అంచనాలు కూడా చాలా భారీగానే ఉంటున్నాయి. ఇక ప్రభాస్ ఫాన్స్ విషయానికి వస్తే, వాళ్ళ హీరో పై వాళ్ళు ఇంకా ఎక్కువ అంచనాలతో ఉన్నారు. ప్రభాస్ సినిమాల కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి సక్సెస్ ఏ రేంజ్ లో ఉండవ చ్చని చర్చించుకుంటున్నారు.

See also  నిజంగా ఆ అమ్మాయి కోసం రవితేజని బాలకృష్ణ కొట్టారా.? అసలేం జరిగింది ఆ రోజు..

prabhas-insulted-by-that-famous-director

అయితే ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ ని ఒక దర్శకుడు చాలా అవమానించాడట. ఆ అవమానాన్ని ( Prabhas insulted by that famous director) కూడా ప్రభాస్ దిగమింగుకుని తిరిగి అతనికి సాయం చేసాడంట. అందుకే రాజు ఎప్పుడు రాజే అంటూ ప్రభాస్ ఫాన్స్ పొంగిపోతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటని అనుకుంటున్నారా? అదేమిటంటే.. ప్రభాస్ పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోనప్పుడు, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రభాస్ ని అవమానించాడట. డైరెక్టర్ గౌతమ్ మీనన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా ఆ సినిమాలలో నటించి కూడా బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్ మీనన్ ఘర్షణ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసినదే. ఈ సినిమాకి మొదట ప్రభాస్ ని హీరోగా అనుకున్నారంట. కానీ తరవాత ప్రభాస్ ని తీసేసారు.

See also  Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

prabhas-insulted-by-that-famous-director

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించి, వెంకటేష్ హీరోగా, హాస్సిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నటించి ఉంటె ఒక సూపర్ హాట్ సినిమా తన ఖాతాలో చేరేది. అయితే అసలు ప్రభాస్ ని కాదని గౌతమ్ మీనన్ ఎందుకు వెంకటేష్ ని పెట్టుకున్నాడు అని ఆరా తీస్తే, అప్పట్లో ప్రభాస్ కి అంత క్రేజ్ లేదు. ప్రభాస్ కంటే వెంకటేష్ కి ఎక్కువ క్రేజ్ ఉందని ఆలోచించి, గౌతమ్ మీనన్ ప్రభాస్ ని ఆ సినిమా నుంచి తొలగించి, వెంకటేష్ ని హీరోగా తీసుకున్నారంట. చూసారా విధి ఎంత విచిత్రమైనదంటే.. ఈరోజు ప్రభాస్ పొజీషన్ ఎక్కడ ఉందొ మనందరికీ తెలుసు. అందుకే పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదని అంటారు.

See also  Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

prabhas-insulted-by-that-famous-director

అయితే ఈ సినిమా ఈవెంట్ ఫంక్షన్ కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు. తనని ఆ సినిమా నుంచి తీసేసినా కూడా మనసులో ఏమి పెట్టుకోకుండా , ఈవెంట్ ఫంక్షన్ వచ్చి, తన రాజరికం చూపించుకున్నాడు ప్రభాస్ అని ఫాన్స్ అనుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో ఆరు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మూడు పాన్ ఇండియా సినిమాలే. ప్రతీ సినిమా కూడా భారీ బడ్జెట్ లోనే వెళ్తున్నాయి. అలాగే ప్రభాస్ పారితోషకం కూడా వందల కోట్లలో భారీగానే ఉంటుంది. ఇప్పటికి చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్ట్స్ కనీసం 3000 కోట్లకు పైగానే ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి.