Adipurush Business: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగులోకి వచ్చిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తెలిసేలా చేసిన బాహుబలి సినిమాలో ప్రభాస్ హీరో కావడం, పాన్ ఇండియా తొలి చిత్రమైన బాహుబలి సినిమా లో అతనే ప్రథమ హీరో ( Prabhas Adipurush movie business ) అవడం నిజంగా ఎంతో అదృష్టంగా భావించాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమా అనగానే ఎంతో భారీ అంచనాలతో సినీవర్గం, సినీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ బాహుబలి 2 సినిమా తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా..
తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వాటి కలెక్షన్ ఇంత వచ్చాయి, అంత వచ్చాయి అని ఎంత చెప్పినా కూడా.. ప్రభాస్ సినిమాగా వాటిని పరిగణంలోకి తీసుకోలేకపోయారు సినీ అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు ( Prabhas Adipurush movie business ) అందరి చూపు ప్రభాస్ సినిమా ఆది పురుష్ మీద పడింది. మొదట్లో ఈ టైటిల్ వినగానే ఈ సినిమా కూడా పోవడం ఖాయం అని ఎందరో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడ నుంచి అందరి ఆలోచనలు మారుతూ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ప్రభాస్ వేషధారణ, డైలాగ్స్, సినిమా స్క్రీన్ రిచ్ నెస్, మ్యూజిక్, గ్రాఫిక్స్.. ప్రతిదీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
పైగా ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అవ్వగానే దాని ఆల్ ఓవర్ ఇండియాలో.. ఆదిపురుష్ ని ఫాలో అవుతున్న విధానం చూస్తే.. అందరికీ దాని మీద కన్ను ఉందని అర్థం అవుతుంది. సినిమా ఓపెనింగ్స్ చాలా గట్టిగా అదిరిపోయే లెవెల్ లో ఉంటుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఎలా జరగబోతుంది అని చూస్తే.. బాహుబలి తర్వాత ( Prabhas Adipurush movie business ) ప్రభాస్ రెండు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగానే నష్టపోయారు. అందుకని ఈ సినిమా విషయంలో ఎక్కువ పెట్టి కొనడానికి చాలా వరకు భయంతోనే ఉన్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా బిజినెస్ సూపర్ గా ఉంది. సినిమాపై నెగెటివిటీ పోయి పాజిటివ్ వచ్చి బిజినెస్ అదిరిపోతుంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 160 నుంచి 170 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా ఓపెనింగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందని.. సినిమా ఎలా ఉన్నప్పటికీ చాలా కాలం నుంచి కుటుంబం అంతా కలిసి చూడగలిగే సినిమా రావట్లేదనే ఫీలింగ్ ని.. ఆదిపురుష్ సినిమా పోగొడుతుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ హిస్టరీ లోనే బెస్ట్ ఓపెనింగ్స్గా నమోదు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంట. జూన్ 16 తేదీన దాదాపు 80% సినిమా హాల్స్ లో కేవలం ఈ ఒక్క సినిమానే వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. 80% సినిమా హాల్స్ లో ఆదిపురుష్ సినిమా మాత్రమే వస్తే మైండ్ బ్లోయింగ్ సెన్సేషన్ అని అనుకోవాలి. ఇది కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సంచలనం క్రియేట్ చేస్తుందేమో అని అనుకుంటున్నారు.