Home Cinema Pawan Kalyan: రికార్డుల మోత మోగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్..

Pawan Kalyan: రికార్డుల మోత మోగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్..

Power Star: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు ఎందుకంటే.. ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటే కేవలం ఓకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. ఇతర హీరోలకి పవన్ కళ్యాణ్ కి  అసలు సిసలైన తేడా ఇదే.. అంతటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మెగాస్టార్ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

power-star-pawan-kalyans-instagram-following-is-breaking-records

ప్రస్తుతం తన అభిమానుల కోసం ఇటు సినిమాలో నటిస్తూనే మరో వైపు రాజకీయపరంగా తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఇక పవర్ స్టార్ సినిమా విడుదల అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా సరే వసూళ్ళు మాత్రం గట్టిగా రాబడుతుంది. అదే కాకుండా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్స్ ఉంటారో మనందరికీ తెలుసు. ఫేస్బుక్ అయినా ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ అయినా యూట్యూబ్ అయిన సరే వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సోషల్ మీడియా పరంగా ఇప్పటి వరకు ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అకౌంట్ కలిగి ఉన్నాడు. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఇంతవరకు లేడు.

See also  Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

power-star-pawan-kalyans-instagram-following-is-breaking-records

అయితే గత రెండు రోజుల క్రితమే ఆయన తన ఆఫీషల్ ఖాతాను ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అలా ఆయన ఇంస్టాగ్రామ్ లో తన ఖాతా ఓపెన్ చేయగా.. అది తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఓ సునామీల వరదల్లా కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలోని ఏ సెలబ్రిటీకి రానంత ఫాలోవర్స్ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆయన ను ఫాలో చేయడం మొదలు పెట్టారు. అయితే ఆయన తన అఫీషియల్ కాతాను ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించిన గంటలోనే లక్షకు పైగా ఫాలోవర్లను ఆయన సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత గంటలోపే ఆ ఫాలోవర్ల సంఖ్య ఐదు లక్షలకు చేరుకున్నది.

See also  RRR Oscar Award: నాటు నాటు పాటకి ఎలాంటి ఆస్కార్ అవార్డు వచ్చిందో తెలుసా?

power-star-pawan-kalyans-instagram-following-is-breaking-records

ఇదంతా కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా వేయకుండా సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా వేయకుండా ఆరు గంటల్లోనే వన్ మిలియన్ ఫాలవర్స్ ను సొంతం చేసుకున్నాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా వెయ్యకుండా ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకున్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీగా తన పేరు నమోదు చేసుకున్నాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ రెండు మిలియన్ ఫాలోవర్స్ కు చేరువలో ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ (Power Star) తన మేనల్లుడు సాయి ధరం తేజ తో కలిసి నటించిన బ్రో చిత్రం ఈ నెల విడుదల కాబోతుంది.