BRO Movie Review : చిత్రం: బ్రో ( BRO )
తారాగణం: పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్, కేతికశర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని మొదలగువారు
కెమెరా: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. తమన్
మాటలు – త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
దర్శకత్వం : సముద్రఖని
విడుదల తేదీ: 28 జులై 2023 ( BRO Movie Review and Rating )
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధర్మ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ ముఖ్యమైన పాత్రలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తూ రూపొందిన చిత్రం బ్రో. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తమిళ్లో సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం గా రూపొంది సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమాని కొన్ని మార్పులు చేర్పులతో తెలుగులో ఈ తారాగణంతో సముద్రఖని దర్శకత్వం వహించి బ్రో సినిమాగా తీశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది సినిమా కథలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ.
సినిమా మొదలు హైదరాబాద్ చూపిస్తాడు. తెల్లవారుజామునే అలారం కొట్టగానే మార్కండేయ అలియాస్ మార్క్ ( సాయిధర్మతేజ్ ) లేస్తాడు. ఇక అక్కడి నుంచి ప్రతిదీ టైం టు టైం లేవడం, ఎక్ససైజ్, టిఫిన్ చేయడం, తయారు అవ్వడం, ఆఫీస్ కి వెళ్దాం అన్నీ కూడా టైం ప్రకారం ఫాలో అవుతూ పరుగులు పెడుతుంటాడు. మార్క్ వాళ్ళింటికి పెద్ద కొడుకు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ప్రతిదీ తన బాధ్యతగానే తీసుకుని చూసుకుంటాడు. మార్క్ కి.. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉంటారు. పెద్ద చెల్లికి పెళ్లి చేయాలని, చిన్న చెల్లి ని చదివించాలని, తమ్ముడు అమెరికాలో ఉంటే తన తమ్ముడికి ఇంటి బాధ్యతలన్నీ అప్పచెప్పాలని అనుకుంటూ ఉంటాడు. అలాగే తన లవర్ రమ్య ( కేతిక శర్మ ) ని ప్రేమిస్తాడు. కానీ ఆమెకి కూడా టైం ఇవ్వలేడు. మార్కు పని చేసే కంపెనీ లో వెన్నెల కిషోర్ కింద వర్క్ చేస్తూ తను త్వరలోనే జీఎం అవుతానని అనుకుంటాడు. ఇలాంటి క్రమంలో మార్క్ అనుకోకుండా చనిపోతాడు. చనిపోయిన మార్క్ కి టైం ( పవన్ కళ్యాణ్క ) ని కలుస్తాడు. అప్పుడు మార్క్ తన బాధ్యతల గురించి.. తను లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమవుతారు అని బాధ పడగా.. అయితే నీకు 90 రోజులు టైం ఇస్తున్నాను.. టైం కూడా మార్క్ తో కలిసి ఉంటాడు. అలా 90 రోజులు భూమ్మీదకి వచ్చిన మార్క్.. ఎవరెవరు గురించి ఏం తెలుసుకున్నాడు? వాళ్ళకి ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే సినిమాకెళ్లి చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే.. సినిమా స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ కనిపించేవరకు సినిమాని పరిచయం చేసినట్టు అనిపించింది. చాలా నార్మల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ టైం రూపంలో కనిపించిన తరవాత పవన్ కళ్యాణ్ తొందరగానే ఎంటర్ అయ్యాడు అనిపించింది. భగవంతుడు టైం రూపంలో మనిషికి కనిపించే ఆ సీన్ లో కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కనిపించింది తప్ప.. భావంతుడు మాత్రం కనిపించినట్టు అనిపించలేదు. ఈ సినిమా ( BRO movie Review and Rating ) కథ చాలామందికి వినోదయ సిత్తం చూసిన వారికి తెలిసి ఉంటుంది కాబట్టి కథ మీద చాలామందికి ఆశక్తి ఉండదు కనుక సీన్స్ పండించే పనిలో పడ్డాడు సముద్రఖని అని అర్ధమవుతుంది. అయితే ఖర్మ సిద్ధాంతం మీద తీసిన ఈ సినిమా.. కథ మూలంలో చాలా అర్ధం ఉంటుంది. అంత గొప్ప కథని ఎన్నుకున్నప్పుడు.. సినిమాలో పాత్రలు కనిపించాలి గాని.. నటులు కనిపించడం సామాన్య ప్రేక్షకుడికి పెద్దగా ఎక్కలేదు.
కానీ పవన్ కళ్యాణ్ వయ్యారి భామ నీ హంస నడక అంటూ దేవుడు అంటే టైం అలంటి పాత పడుతూ.. రైల్వే కూలి గెటప్ లో వస్తే ఆయన ఫాన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మొత్తం డిఫరెంట్ లుక్స్, ఆయన సినిమాల్లో పాటలు, చూపిస్తూ.. మాటల మాంత్రికుడు రాసిన డైలాగ్స్ ని అందంగా డెలివరీ చేయడం వరకు మాత్రమే నిమిత్తం అయినట్టు అనిపించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం ఉంటాడు అని చాలామంది అనుకుని వెళ్లారు గాని.. పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు కనిపించినట్టే ఉంది గాని.. ఎక్కువగా కష్టపడి నటించలేదు. డైలాగ్స్ లో రాజకీయాలకు సంబంధించిన మాటలు కలవాలి అని అనుకునే త్రివిక్రమ్ డైలాగ్స్ రాసినట్టు అనిపించింది. మాటలు రాసేటప్పుడు కేవలం సినిమా మూలం కథని.. అర్ధాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని.. అసలు రాజకీయం అనేది ప్రేక్షకుడికి గుర్తుకు రాకుండా ఉండేలా రాసి ఉంటె బాగుణ్ణు అనిపించింది.
చనిపోయాడేమో అనుకున్న సాయి ధర్మ తేజ్ క్షేమంగా ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాళ్ళ సీన్స్ అక్కడ సెంటిమెంట్ పెద్దగా పండినట్టు అనిపించలేదు. పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం బాగుంది. ఇక ఈ సినిమాలో సాయి ధర్మ తేజ్ నటనలో ఎక్కడా కూడా హీరోయిజం మాత్రం లేదు. కేవలం పవన్ కళ్యణ్ అంటే భయమో లేక భక్తితోనో నటించినట్టు అనిపించింది. సామాన్య మానవుడికి దేవుడు కనిపించడం లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అందులోనూ ( BRO movie Review and Rating ) పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించిన గోపాలా గోపాలా సినిమా తో ఈ సినిమాని అందరూ పోలుస్తున్నారు. అలా పోల్చుకుని చూస్తే ఈ సినిమా కంటే గోపాల గోపాల సినిమా చాలా బాగున్నట్టు అనిపించింది. అందులో చాలా పాత్రలకు విలువ ఇచ్చి, సినిమా తీస్తారు. కానీ ఈ సినిమాలో కేవలాం.. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధర్మ తేజ్ మాత్రమే కనిపిస్తారు. పైగా వీళ్లిద్దరు మధ్య కెమిస్ట్రీ కూడా 50 % మాత్రమే పండింది.
ఫస్ట్ ఆఫ్ సినిమా అలా ఎదో కొంచెం సరదాగా సాగినట్టు అనిపించింది. ఆలా అని అంత హుషారు ఏమి తెప్పించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ తన సాంగ్స్ లో కనిపించే ప్రతీసారి సినిమా హోల్ లో, చూసే ప్రేక్షకులలో ఒక మంచి హుషారు వచ్చేది. సినిమాలో పవన్ కళ్యాణ్ సాయి ధర్మ తేజ్ కి చెప్పే డైలాగ్స్ అన్ని బాగుంటాయి. మీనింగ్ ఫుల్ గా, సెటారికల్ గా ఉంటాయి. కానీ.. వాటిని చెప్పే క్రమంలో అక్కడ సిట్యుయేషన్, తేజ్ లో రియాక్షన్ ( BRO movie Review and Rating ) అంతగా మనసులను హత్తుకునేలా లేవు. కంటెంట్ బాగుంది గాని.. దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చేసే విధానం అంత బాగా చిత్రీకరించినట్టు లేదు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఇంటర్వెల్ వరకు సినిమా కొంచెం బాగానే ఉంది అనిపించింది.
సెకండ్ హాఫ్ చూస్తే.. సినిమాని సాగదీసినట్టుగా.. స్క్రీన్ ప్లే కూడా బాలేనట్టు అనిపించింది. సినిమాలో పాటలు మాత్రం చాలా మైనస్. సెంటర్ చూసి కొడతా అనే పవన్ కళ్యాణ్ ఊతపదం డైలాగ్ దేవుడి స్థానంలో ఉండి అస్సలు బాలేదు అనిపించింది. స్టోరీ అందులో వచ్చే మార్పులు అన్ని బాగానే ఉన్నట్టు అనిపించినా.. ఎక్కడా కూడా ఎమోషన్ అనేది కలగలేదు. అయితే సినిమా లాస్ట్ చేసి కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినా తర్వాత.. మార్క్ లో కలిగే మార్పు క్రమంలో .. గతాన్ని.. కుటుంబంలో కష్టాలని చూపించే టైం లో ప్రేక్షకుడు కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాడు. అయితే తేజ్ అస్తమాను ఓల్డ్ తేజ్ లా కనబడే సీన్స్ బోర్ అనిపించాయి. బ్రహ్మానందం కనిపించిన ఒక్క సీన్ ఆయన మార్క్ లో ఆయన బాగానే నటించి వెళ్లిపోయారు.
ఇక మిగిలిన పాత్రలు అన్ని వాళ్లకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి వాళ్ళు నటించారు గాని.. సినిమాలో ఎవరికీ ప్రాధాన్యత అనేది ఏమి లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధర్మ తేజ్ వీళ్లిద్దరి కెమిస్ట్రీ మీదనే సినిమా మొత్తం నడవాలి. అలా మనిషికి దేవుడు కనిపించే ముందు వచ్చిన చాలా సినిమాలు కంటే గాని, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, కామెడీ, సెంటిమెంట్ కంటే వీళ్ళిద్దరూ ఏమి బీట్ అవుట్ చేయలేదు. కాకపోతే ఈ సినిమాలో కనిపించేది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్క్ ఒక్కటే.. సినిమాలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రతీ మాట బాగుంటుంది. పంచ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్ మాటలకు కొరత లేదు అనిపించింది.కానీ ఎక్కడా కూడా మంచి కంటెంట్ చూస్తున్నప్పటికీ కూడా.. మంచి ఫీల్ ని మాత్రం తెలెకపొయారు అని గట్టిగా అనిపించింది.
తెలిసిన స్టోరీ అయినా కూడా.. అదిరిపోయే సీన్స్ ఉన్నాయి అని అనిపించకపోయినా కూడా, పాటలు మెప్పించకపోయినా కూడా, సినిమాలో హాస్యం పండకపోయినా, సినిమా పరవాలేదు ఒక సారి చూడచ్చు అని చివరికి అనిపించేలా చేయడంలో దర్శకుడు సముద్రఖని సక్సెస్ ( BRO movie Review and Rating ) అయ్యాడని చెప్పుకోవచ్చు. పవన్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చవచ్చు గాని.. సగటు ప్రేక్షకుడికి ఇది యావరేజ్ సినిమాలా ఉంటాది. టైం లేకపోయినా, బడ్జెట్ లేకపోయినా, అభిమాని కాకపోయినా నిమ్మదిగా ఓటీటీ లో కూడా చూద్దాం లే అని అనుకునే అవకాశం లేకపోలేదు. చివరిగా ఈ సినిమా దేవుడు కనిపించి మనకి సత్యాలు చెప్పిన ఫీలింగ్ రాలేదు.. పవన్ కళ్యాణ్ నేను ఎం చెబితే దానిని మీరు భక్తుల్లా వినండి అని చెప్పినట్టు ఉంది.
రేటింగ్: 2.5 / 5
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే. అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.