Home Cinema Popular senior heros: మన సీనియర్ హీరోల ఆస్తుల వివరాలు తెలిస్తే నోరేళ్ళ పెడతారు..

Popular senior heros: మన సీనియర్ హీరోల ఆస్తుల వివరాలు తెలిస్తే నోరేళ్ళ పెడతారు..

Popular senior heros: మనందరికీ తెలుసు హీరోలంటే వాళ్ళ అభిమానులకు ఎంత పిచ్చి ఇష్టముంటుందో. జీవితంలో వాళ్ళ అభిమాన హీరోలను ఒక్కసారైనా కలవాలని వాళ్లతో సెల్ఫీ దిగాలని అనుకుంటారు. ఇక మరికొందరైతే వాళ్ల గురించి ఎప్పుడెప్పుడు ఏదన్నా ఇంట్రెస్ట్ న్యూస్ పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుందా.. అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఏ హీరోలు ఎంత ఆస్తులు కూడా పెట్టారు, ఏ కార్లు కొన్నారు, ఎక్కడ ఏ సినిమాకి ఎంత తీసుకుంటున్నారు. అని ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకోవాలని కుతూహలం కచ్చితంగా ఉంటుంది.

popular-senior-heros-assets-and-properties-list

ఎందుకంటే వీళ్లకు వాళ్ళు ఫాన్స్ కనుక ఇక ఒకప్పుడు స్టార్ హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ తరంలో వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు.. ఇక ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలు వచ్చారు. ఇక ఇప్పుడైతే హీరోలకు కొదవలేదని చెప్పాలి ఎందరో మంది పుట్టుకొచ్చారు. సొంత టాలెంట్ తో మెప్పియ్యడానికి ముందుకు వచ్చిన హీరోలు కొందరైతే, వంశపారపర్యంగా హీరోలాగా కొనసాగే వాళ్ళు మరికొందరు.. ప్రస్తుతానికైతే ఒక రెండు మించిన హిట్స్ మరొకరు కొట్టడానికి సినిమాల మీద సినిమాలు తీస్తూ ఉన్నారు.. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోల జాబితాలో ఉన్నది మాత్రం అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, దగ్గుపాటి వెంకటేష్.. వీళ్ళ ఆస్తుల వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే.. (Popular senior heros)

See also  Kalki 2898 AD: కల్కి సినిమా కాన్సెప్ట్‌ లీక్.. కథలో ఊహించని ఈ మలుపులు..

popular-senior-heros-assets-and-properties-list

అక్కినేని నాగార్జున:  అక్కినేని నాగేశ్వరరావు తనయునిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించి స్టార్ హీరోగా ఎదిగిన నాగార్జున గారికి ఇద్దరు కొడుకులు చైతన్య, అఖిల్ వీళ్లు కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోలుగా సినిమాలు తీస్తూ కొనసాగుతున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే హీరో గానే కాకుండా నాగార్జున మంచి బిజినెస్ మాన్ గా కూడా పేరు సంపాదించాడు. నాగార్జున మొత్తం ఆస్తులు అన్నపూర్ణ స్టూడియోతో కలుపుకుని దాదాపు 12 వేల కోట్ల దాకా ఆస్తి ఉన్నట్లు సమాచారం.

See also  Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

popular-senior-heros-assets-and-properties-list

మెగాస్టార్ చిరంజీవి:  మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే సొంతంగా తను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ నేడు కోట్ల రూపాయల సంపాదన అతని సొంతమైంది. చిరంజీవి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న భారతీయ హీరోలలో ఒకరిగా కొన్నేళ్లపాటు కొనసాగాడు. చిరంజీవి మొత్తం ఆస్తి విలువ 1650 కోట్లపైగా ఉంది. వీటిలో విలాసవంతమైన లగ్జరీ ఫామ్ హౌస్ చెన్నైలో అలాగే బెంగళూరులో కలవు. ఇదేకాక హైదరాబాద్లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఈ మధ్య కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఆయన తన ఇంటిని మరింతంగా హుందాగా తీర్చి దిద్దుకున్నాడు

See also  Nagarjuna: సమంతకు విడాకులు ఇవ్వమని నాగ చైతన్యకు చెప్పింది నాగార్జున నేనా.??

దగ్గుబాటి వెంకటేష్:  వెంకటేష్ గురించి చెప్పాలంటే తన తండ్రి రామానాయుడు ఆస్తులతో పాటు ఎన్నో ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు వెంకటేష్. ఇప్పటివరకు ఆయన ఆస్తి మొత్తం 2200 కోట్లకు పైగా కూడపెట్టినట్టు సమాచారం. ఇక ఇదే కాకుండా తన తండ్రి వారసత్వంగా ఆయనకు రానున్న ఆస్తి 3000 కోట్లకు పైగా రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇంకా వీటన్నిటిని కలుపుకుని ఆయన ఆస్తి విలువ సుమారు 5 వేల కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తుంది.