Popular Actress: మనందరికీ సెలబ్రిటీలకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. డేటింగ్ అనే పేరుతో హీరో హీరోయిన్లకు మోజు తీరేంతవరకు వాళ్ళిద్దరి మధ్యల భేదాభిప్రాయాలు రానంత వరకు కొనసాగిస్తారు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడితే విడిపోతుంటారు. ఇలాంటి డేటింగ్ కల్చర్ మనది కాదు విదేశీయుల నుంచి వచ్చినది. ప్రస్తుతానికైతే ఆర్థికంగా వెనుకబడిన వారు ఇలాంటివి కల్చర్ లకు దూరంగా ఉంటున్నారు కానీ.. బాగా ధనం ఉన్నవారు, చదువుకున్న వారు, మరి అదేవిధంగా సెలబ్రిటీలు డేటింగ్ అనే పేరుతో వారికి నచ్చిన వాళ్ళతో సహజీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యలో ఒకవేళ తాను తల్లి అయితే ఆ బంధాన్ని అలాగే కొనసాగించి చివరికి పెళ్లి పీటలు ఎక్కుతారు. కడుపులో పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.
అలా పెళ్లికి ముందు తల్లి తండ్రులు అయిన భార్యాభర్తల ఎవరో మనమిప్పుడు తెలుసుకుందాం..
శ్రీదేవి: దివంగత నటి అతిలోకసుందరి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె ఇప్పటికీ అందరి మదిలో ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నాము. ఇక పెళ్ళి అవ్వకముందే తను తల్లి అయ్యింది. ఆమె నవమాసలు మోసింది మరెవరినో కాదు జాన్వీ కపూర్ నే. గర్భవతి అయిన తర్వాతే బోనీ కపూర్ ను పెళ్ళాడింది శ్రీదేవి.
రేణు దేశాయ్: బద్రి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పవన్ కళ్యాన్ పరిచయం చేసాడు. ఆ తరువాత జాని చిత్రంతో కలిసి నటించిన వీళ్ళిద్దరు అప్పటికీ ప్రేమలో ఉన్నారు. అప్పటికే వీళ్ళిద్దరి మధ్య సాగుతున్న సహజీవనంతో వివాహనికి ముందే పిల్లలకు జన్మనించింది రేణు దేశాయ్. ఆ తర్వాత 2009 వ సంవత్సరంలో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. పన్నెండు సంవత్సరాల వీళ్ళ ప్రయాణం తర్వాత విడాకులు తీసుకున్నారు.
సెలీనా జైట్లీ: ఈమె వివాహానికి ముందే గర్భం దాల్చి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత పీటర్ హగ్ ను వివాహం చేసుకుంది. ఆ ఇద్దరు కవల పిల్లల పేర్లు విన్ స్టన్, విరాజ్.
సారిక: తమిళ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు అప్పట్లో కమలహాసన్ తో సహజీవనం కొనసాగించింది. దానికి ప్రతిఫలమే వీళ్లిద్దరికి పుట్టిన శృతిహాసన్.. దాని తర్వాత కూడా వీళ్ళిద్దరి జంటకు అక్షర హాసన్ జన్మించింది.
అమృత అరోరా: పెళ్లికి ముందే ఈమె గర్భవతి అయ్యి బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె షేకలా లడక్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన కొద్ది రోజులకే ప్రెగ్నెన్సీ అందడంతో అతన్నే వివాహం ఆడింది.
నీనా గుప్త: వెస్టిండీస్ క్రికెటర్ వీవ్ రీచర్డ్ తో డేటింగ్ చేసిన ఈ అమ్మడు ప్రెగ్నెనసీ వచ్చింది.. కానీ రెచర్డ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు కానీ నీనా మాత్రం ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
కొంకణ సేన్ శర్మ: రణబీర్ షోరే తో ఎంతో కాలం పాటు రిలేషన్ షిప్ కొనసాగించిన ఈ అమ్మడు, ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి, ఈ విషయాన్ని పెళ్ళయిన కొన్ని నెలలకు అందరికీ తెలిపింది.
అమీ జాక్సన్: తన స్నేహితుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మడు ఆ మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరికీ తెలిపింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
అలియా భట్: అందరి హీరోయిన్ల లాగే ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆ తర్వాత రన్బీర్ కపూర్ ను వివాహం చేసుకుంది.
పూర్ణ: అవును చిత్రంతో ఫేమస్ అయిన పూర్ణ కూడా వివాహనికి ముందే గర్భం దాల్చిందట. దుబాయ్ కి చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేస్తున్న ఈమె అక్టోబర్ నెలలో వివాహం చేసుకుంది. కానీ ఈమె వివాహమైన ఆరు నెలల్లో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇలియానా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవలే తన సోషల్ మీడియా ద్వారా తాను గర్భవతి నన్న విషయాన్ని తెలిపింది కానీ ఇప్పటివరకు ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని మాత్రం తెలుపలేదు దీంతోనే తింటా దాని గురించి రచ్చ నడుస్తుంది. ఇక వీళ్ళే కాకుండా.. వీళ్ళ జాబితాలో మరెందరో హీరోయిన్లు క్యూ కట్టారు. (Popular Actress)