Pooja Hegdes Film Career: తెలుగు చిత్ర పరిశ్రమలో బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే సినీ కెరియర్ మొత్తం పూర్తిగా అల్లకల్లోలమైందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె గ్రాఫ్ మొత్తం పూర్తిగా పడిపోయింది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సంగతి పక్కకు పెడితే.. కనీసం కుర్ర హీరోలు కూడా పూజ హెగ్డే అని పట్టించుకొని పరిస్థితి ఏర్పడింది. ముంబైలో జన్మించిన ఈ బుట్ట బొమ్మ మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలెట్టింది. ఇక ఆ తర్వాత 2012 సంవత్సరం లో ఓ హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2014 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కినటువంటి దువ్వాడ జగన్నాథ్ చిత్రంతో పూజా హెగ్డే దశ తిరిగిపోయింది.
ఇక ఈ చిత్రం తర్వాత మన తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలకు జోడిగా డాక్టర్ నటిస్తూ స్టార్ హోదాను కైవసం చేసుకుంది. ఇక ఆ సమయంలో పూజా హెగ్డే కి బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుంచి సైతం అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతా మంచిగా కొనసాగుతుందనుకున్న తరుణంలో రాధే శ్యామ్ రూపంలో పూజా హెగ్డే దరిద్రం మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజన్ ప్లాఫులు వెంట వెంటనే పూజా హెగ్డే ఖాతాలో చేరిపోయాయి. దాంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఐరన్ లెగ్ అంటూ పిలవడం మొదలు పెట్టారు.
ఇదే క్రమంలో పూజా హెగ్డే కి అవకాశాల ఊసు లేదు. క్రమ క్రమంగా వచ్చినా అవకాశాలు సైతం వెనుతిరిగి పోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేదు. దాంతో సోషల్ మీడియా కి పరిమితమైన పూజా హెగ్డే నిత్యం తన ఘాటు ఫోటోషూట్స్ తో గ్లామరస్ గా అందర్నీ ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఇక కాళీ ఉండే సమయాల్లో ఏం చేద్దాం అన్నట్లు నాలుగు రాళ్లు పక్కకు వేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళ్తూ రిబ్బన్ కట్లు చేస్తోంది. కాగా పూజ హెగ్డే సినీ కెరీర్ ఒక్క సారిగా ఇలా కుప్పకూలి పోవడానికి కారణం ఆమె తల పొగరు అని ఎన్నో రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పూజ హెగ్డే చాలా తల పొగరుగా ప్రవర్తించిందట.. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోతే కుదరదు అంటూ కరాకండిగా తేల్చి చెప్పేదట. పైగా కాల్ సీటు విషయంలో సైతం అందరిని ముప్పు తిప్పలు పెట్టించేదట. ఎంత పెద్ద హీరో అయినా సరే ప్రొడక్షన్ టీమ్ అడిగిన సమయంలో డేట్స్ ఖాళీగా లేవు అంటూ తెగ ఇబ్బందులకు గురి చేసేదట. ఇక షూటింగ్ కు వచ్చిందంటే తన వెంట పది మందిని తీసుకొస్తూ వారి ఫుడ్ అన్ని ఖర్చులు నిర్మాణ సంస్థ పైనే రుద్దేదట. అందుకే ఇప్పుడు పూజా హెగ్డే అవకాశం ఇచ్చేందుకు కూడా ఈ నిర్మాణ సంస్థ ముందు అడుగు వేయడం లేదని ఇండస్ట్రీలో అయితే జోరుగా మనకి వినిపిస్తున్నది. ఇక పూజా హెగ్డే కి ఏ అవకాశం రాకుండా ఇలాగే మరొక రెండు లేదా మూడు సంవత్సరాల పాటు ఉన్నట్లయితే ఇక ఆమె సినీ కెరీర్ (Pooja Hegdes Film Career) పని ఐపోయినట్లే మనకి తెలుస్తుంది.