Home Cinema Pooja Hegde : త్రివిక్రమ్ లో ఆ బుద్దిని బట్టబయలు చేసిన పూజా హగ్దే !

Pooja Hegde : త్రివిక్రమ్ లో ఆ బుద్దిని బట్టబయలు చేసిన పూజా హగ్దే !

pooja-hegde-came-out-from-the-guntur-karam-movie-because-of-trivikram-behavior

Pooja Hegde : మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కాలం గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం ( Pooja Hegde and Trivikram ) ఇలా ముఖ్య తారాగణం కూడా ఉంది. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు ఎంత ఉందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. అసలు పూజ హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది అనేదానిపై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

pooja-hegde-came-out-from-the-guntur-karam-movie-because-of-trivikram-behavior

గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం కూడా వేరెవరో కాదు.. ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ అని అంటున్నారు. త్రివిక్రమ్ కి పూజా హెగ్డే కి పడటం లేదని.. ఆమెని ( Pooja Hegde and Trivikram ) కించపరుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే కంటే శ్రీలీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని.. కథ పరంగా, కంటెంట్ పరంగా శ్రీలీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి.. పూజ హెగ్డే కి చాలా తక్కువ రోల్ ఇచ్చి.. చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు. అందుకే గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని.. అడ్వాన్స్ గా ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసిందని.. త్రివిక్రమ్ వల్లే నేను బయటకు వచ్చేసాను అని ఆమె చెప్పిందని వార్తలు వస్తున్నాయి.

See also  Srimukhi: బంగారం లాంటి శ్రీ ముఖి భవిష్యత్తును నాశనం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..??

pooja-hegde-came-out-from-the-guntur-karam-movie-because-of-trivikram-behavior

పాపం ఇప్పటికే పూజా హెగ్డే కి హిట్స్ అనేవి చాలా కరువు అయిపోయాయి. ఆమె కెరీర్ ఎలా ఉంటాదో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ.. చిన్న చిన్న హిట్స్ కూడా సంపాదించుకోలేకపోతోంది. రాధేశ్యామ్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా ( Pooja Hegde and Trivikram ) ముఖ్యమైన పాత్ర. సినిమా స్టోరీ అంత ఆమె చుట్టూనే తిరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఆమెకు గొప్పగా పేరు ఏమి రాలేదు. ఆ తర్వాత హిందీలో కిసీ కా భాయ్ కిసీకా జాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే నటించడం జరిగింది. ఆ సినిమాలో కూడా పూజ హెగ్డే కి ఎలాంటి పేరు రాలేదు.. పైగా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

See also  Sai Pallavi: అలా చేసినా రేప్ తో సమానమేనని కొత్త నినాదంతో ముందుకొచ్చిన సాయి పల్లవి.. మరి దీనికి సపోర్ట్ చేసేదెవరు?

pooja-hegde-came-out-from-the-guntur-karam-movie-because-of-trivikram-behavior

అంత పెద్ద స్టార్స్ ఉన్న హీరోలతో నటిస్తూ.. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో భారీ బడ్జెట్ మీద ఉన్న సినిమాల్లో నటిస్తూ కూడా.. ఆమె మంచి సక్సెస్ ని పొందలేక పోతుంది. దీనితో పూజా హెగ్డే ఐరన్ లెగ్ అని కూడా పేరు సంపాదించుకుంది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే ఎంతో నెమ్మదిగా ఉండాల్సింది పోయి.. అనవసరంగా చిన్న చిన్న వాటికి దర్శకుడితో గొడవలు చేసుకోవడం ఏంటని అందరూ వాపోతున్నారు. ఇక మహేష్ అభిమానులైతే అమ్మయ్య పూజా హెగ్డే తప్పుకుంటే మంచిదే.. ఇక మా హీరో సినిమా ఫెయిల్ అవుతదేమో అని అనుమానం ఏ కొసానా పెట్టుకోన క్కర్లేదని ఆనందిస్తున్నారు. ఈ న్యూస్ పై అఫీషియల్ గా పూజా హెగ్డే కానీ చిత్ర బృందంగానీ ఎటువంటి విధంగా నోరు విప్పడం లేదు మౌనంగా ఉన్నారంటే.. ఇందులో నిజమే ఉండి ఉంటుందని కొందరు అంటున్నారు. ఏమో చూద్దాం మరి..