Pawan Kalyan Son Akira: మనందరికీ తెలిసిన విషయమే సినిమా ప్రపంచంలో మన అభిమాన నటీనటుల వారసులు ఎప్పుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతారు వాళ్ళ మొదటి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఎంతో ఆత్రుతగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం అయిందట కానీ ఈ సారి హీరోగా కాకుండా ఆకిరా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడట..
రైటర్ బ్లాగ్ అనే ఓ షార్ట్ ఫిలిం కి మొట్టమొదటిసారి ఆకిరానందన్ సంగీతం అందించాడు. ఇక ఈ విషయాన్ని హీరో అడవి శేషు తెలిపాడు రైటర్ బ్లాక్ సాఫ్ట్ ఫిలిం లింకును తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి టీం మొత్తానికి అభినందనలు తెలియజేశాడు. నాకెంతో ఇష్టమైన ఆకిరా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడని తెలిపాడు. ఇక ఈ షార్ట్ ఫిలిం కథ విషయానికి వస్తే ఓ రచయిత కథను రాయడంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వాటిని ఎలా అధిగమించాడనే కథతో ఈ షార్ట్ ఫిలిం పూర్తవుతుంది. ఇకపోతే ఇంగ్లీషులో విడుదల అయిన ఈ షార్ట్ ఫిలిం కి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించగా ఇందులో యాక్టర్ గా మనోజ్ నటించాడు.
ఫణి మాధవ్ సినిమా ఆటోగ్రాఫర్ గా పని చేయగా ఈ ప్రాజెక్టుకి ఆకిర మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక ఈ షార్ట్ ఫిలిం సమయం విషయానికొస్తే నాలుగున్నర నిమిషాల సమయం ఉన్నాయి షార్ట్ ఫిలిం కి ఆకిరా అందించిన మ్యూజిక్ ఎంతో ఆకట్టుకునేలా అనిపిస్తుందట. నిజానికి ఆకిరాకు మ్యూజిక్ అంటే చిన్నతనం నుండి ప్రాణం. దానికోసమే ప్రత్యేకంగా పియానో ప్లే చేయడం కూడా నేర్చుకున్నాడు. ఇదే కాక తన ఇంటర్మీడియట్ పూర్తయినప్పుడు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ పాటకు పియానో ప్లే చేసి అందరి దృష్టి తన వైపు మల్లెల ఆకర్షితుడయ్యాడు.
మరి అదే విధంగా ఆకిరాకు వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధమున్న విషయం మనందరికీ తెలిసిందే.. కొన్ని సంవత్సరాల కిందట ఓ సినిమా కార్యక్రమంలో ఆకిరాను కలిశానని.. అప్పటినుంచి తనంటే అడవి శేషుకి ఎంతో ఇష్టమని ఇప్పటికే ఎన్నోసార్లు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం వెలకట్టలేనిది.. ఇక త్వరలో ఆకిరా (Pawan Kalyan Son Akira) హీరోగా రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.