Home Cinema Chiranjeevi-Pawan Kalyan : చిరంజీవిని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టాడట!

Chiranjeevi-Pawan Kalyan : చిరంజీవిని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టాడట!

pawan-kalyan-angry-with-chiranjeevi-for-his-first-movie-selection

Chiranjeevi-Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న ఈ స్టార్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గానే సినిమా రంగానికి పరిచయమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు. పెద్ద కొడుకు చిరంజీవి,రెండవ కొడుకు నాగబాబు, ఆఖరివాడు ( Pawan Kalyan angry with Chiranjeevi ) పవన్ కళ్యాణ్. చిరంజీవికి చిన్న తమ్ముడు అంటే చాలా ఇష్టం ఉండేది అంట. చిన్నోడని చాలా ముద్దుగా చూసేవాడు అంట. ఆ ముద్దు కాస్త ఎక్కువ అయ్యి.. పవన్ కళ్యాణ్ చదువులో చాలా వీక్ గా ఉండేవాడంట. ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయాడు అంట. అయితే అన్నయ్య లాగా ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని సినిమాలో హీరో అవ్వాలి అని అనుకునేవాడంట.

pawan-kalyan-angry-with-chiranjeevi-for-his-first-movie-selection

చిరంజీవి మాత్రం సినిమాలు అలాంటివి ఏమీ వద్దు బాగా చదువుకో అని చెప్పి తిట్టేవారంట. అయినా కూడా చదువు మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎక్కేది కాదంట. అయితే చివరికి సరే సినిమాలు చూద్దామని పవన్ కళ్యాణ్ గురించి కథలు వింటూ ఉండేవారు చిరంజీవి కానీ.. చిరంజీవికి ఈ కథ అంత తొందరగా నచ్చేది కాదంట. పవన్ కళ్యాణ్ మరోపక్క ( Pawan Kalyan angry with Chiranjeevi ) ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటూ.. నేను బౌద్దిజం తీసుకుంటాను అనుకుంటూ ఉండేవాడంట. తమ్ముడు భవిష్యత్తు ఏమవుతుందో మంచి సినిమా చేసి.. సినిమా రంగంలోనైనా నిలబడాలి అని చిరంజీవి భావించి చాలా శ్రద్ధ పెట్టి కథలు విని ఏది నచ్చేది కాదంట. ఇలా చూసి చూసి ఒకరోజు పవన్ కళ్యాణ్ చేసిన పని మామూలు పని కాదు..

See also  Prabhas: ఆ ఒక్క రాత్రి కృష్ణం రాజు కోట్లు ఖర్చు పెట్టాడు ప్రభాస్ కోసం. ఎందుకంటే.?

pawan-kalyan-angry-with-chiranjeevi-for-his-first-movie-selection

చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎదిరించాడంట. ఏ కథ ఎవరు వచ్చి చెప్పినా బాలేదంటావ్ ఏంటి? ఇంక నేను సినిమా ఎప్పుడు చేసేది? నువ్వు నన్ను సినిమా హీరో చెయ్యు లేదా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనుకుంటూ ఇంట్లో ఇంట్లో నుంచి పవన్ కళ్యాణ్ పారిపోయాడంట. దానితో చిరంజీవి తమ్ముడు కోసం వెతికి వెతికి బెంగళూరులో పట్టుకొని ( Pawan Kalyan angry with Chiranjeevi ) తీసుకొచ్చి, చెన్నైలో ఇంట్లో పెట్టాడంట. ఇంట్లో పెట్టి.. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని బయటకు వదలొద్దని నాలుగు గోడల మధ్య ఒక రూమ్ లో పెట్టేసి.. ఆ రూమ్ కి కాపలాగా పెద్దతమ్ముడు నాగబాబు ని పెట్టాడంట. ఆ తర్వాత నెమ్మదిగా అనేక కథలు విని.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథ నచ్చి ఆ సినిమా తన తమ్ముడికి అయితే సూట్ అవుతుందని చిరంజీవి అనుకున్నాడంట.

See also  Anasuya : అదిరిపోయే అందాలను ఆరబోస్తూ జిమ్ లో అనసూయ వీడియో వైరల్

pawan-kalyan-angry-with-chiranjeevi-for-his-first-movie-selection

అప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేయించారంట. ఇలా పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డారంట. తమ్ముడు అంటే కొడుకుతో సమానంగా చూసుకొని.. చదువుకోవాలని, బాగా సెట్ అవ్వాలని చిరంజీవి క్రమశిక్షణతో ఆలోచించిన తీరుని.. పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లోనే ఎదురు తిరిగి సినిమాలు కావాలంటూ చిరంజీవికి ఎదురు తిరిగి వినకపోతే ఇంట్లోంచి పారిపోయి ఏంటెంటో చేసి.. చిరంజీవిని బాగా టార్చర్ పెట్టాడంట. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చిరంజీవిని అంతగా టార్చర్ పెట్టాడు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మీటింగ్లో నేను ఇంట్లో నుంచి ఇలా వెళ్ళిపోయాను అలా వెళ్ళిపోయాను అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వార్తలో ఎంతో కొంత నిజమే ఉండి ఉంటుంది కానీ.. ఏదేమైనా చిరంజీవి పేరు నిలబెట్టేలా పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండటం.. చిరంజీవికి కూడా గర్వకారణమేగా అని అభిమానులు అనుకుంటున్నారు.