Home Cinema Bro Movie Preview Review : బ్రో సినిమా ప్రివ్యూ రివ్యూ..

Bro Movie Preview Review : బ్రో సినిమా ప్రివ్యూ రివ్యూ..

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-movie-preview-review

Bro : మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న” బ్రో ది అవతార్ ” అనే మెగా మల్టీస్టారర్ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయిధర్మతేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ( Bro Movie Preview Review ) మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సామాన్య సినీ అభిమానులకు కూడా ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరిలోను ఒక రకమైన ఆసక్తి పెరిగింది. మరి అందరి ఆసక్తిని ఈ సినిమా సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి.

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-movie-preview-review

బ్రో సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యు సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా దుబాయిలో ప్రివ్యూ వేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే సెన్సార్ వారు కూడా ఈ సినిమా గురించి మంచి రివ్యూ ఇచ్చారు. ప్రివ్యూ వార్తలు ప్రకారం ఈ సినిమా రివ్యూ ఎలా ఉందంటే.. ఈ సినిమా ఫస్ట్ అఫ్ అంతా కూడా సాయిధర్మ తేజ్ ని ( Bro Movie Preview Review ) మాత్రమే చూపిస్తారంట. ఇంటర్వెల్ ముందు ముందు పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతాడు. ఈ సినిమాలో మార్క్ అలియాస్ మార్కండేయులు ( సాయి ధర్మ తేజ్ ) కుటుంబం కోసం నిరంతరం కష్టపడే మనిషి అంట. మార్క్ తన టైమ్ ని విపరీతంగా కేవలం సంపాదించడం కోసం, బాధ్యతలు కోసమే వాడతాడట. ఎప్పుడు చూసినా టైం లేదు టైం లేదు అనుకుంటూ టైం తో పోరాడుతూ ఉంటాడు.

See also  Lavanya Tripathi: మెగా హీరో గాలి తీసేసిన లావణ్య.. అవ్వ అంత మాట అన్నది ఏంట్రా బాబు.??

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-movie-preview-review

అలాంటి మార్క్ కి ఒక రోజు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతని పేరే టైం. ఈ పేరుతో సినిమాలో ఎంటర్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్క్ టైం కోసం ఏం కోల్పోతున్నాడు.. టైం ఎలా వాడాలో.. అతను టైం తో ప్రతిదీ కొలవడం వలన ఏమేమి కోల్పోయాడో.. మార్క్ ని కాలం వెనక్కి తీసుకుని వెళ్లి.. అప్పటివరకు మార్క్ కోల్పోయిన ( Bro Movie Preview Review ) ఆనందాలని, సంతోషాలని చవిచూపించి.. టైం అనేది డబ్బుతో కొలవకూడదని చూపిస్తాడు. టైం.. మార్క్ జీవితంలో ఎంటర్ అవడానికి ముందు ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. అది ప్రేక్షకులు ఊహించలేనిదంట. అయితే ఫస్ట్ అఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండి సెకండ్ సెంటిమెంట్ ని పండిస్తుందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఫుల్ జోష్లో ఉంటుందంట. ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రని పోషించలేదంట.

See also  లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-movie-preview-review

మార్క్, టైం వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. అది ప్రేక్షకుల్ని చాలా గట్టిగానే మెప్పిస్తుందని అంటున్నారు. జీవితంలో మనుషులు, సెంటిమెంట్స్, చిన్న చిన్న ఆనందాల విలువల్ని టైం మార్క్ కి చాలా బాగా బోధిస్తాడంట. టైం డిఫరెంట్ ఆవారా పాత్రలలో కనిపిస్తూ.. విపత్కరమైన పరిస్థితుల్లో.. మార్క్ పక్కనే ఉంటూ .. తనకు సరైన సలహాలు ఇచ్చి కాపాడుతూ ఉంటాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ళిద్దర్నీ పెద్దగా వినియోగించుకోలేకపోయారని అంటున్నారు. మిగిలిన పాత్రలన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్యనే అలా వచ్చి అలా పోతూ ఉంటాయంట. మొత్తం సినిమా వీళ్లిద్దరు మీదే ఉంటుందంట. అలాగే సాయిధర్మ తేజ్ పాత్ర, తన నటన కూడా సినిమాకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోవని మిగిలినవన్నీ పరవాలేదు బాగానే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ప్రీ రివ్యూ ప్రకారం.. ఇదే ఒపీనియన్ 28వ తారీకు రిలీజ్ అయిన తర్వాత.. ప్రేక్షకుల్ని కూడా సాటిస్ఫై చేస్తే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు.