అమ్మాయి కోసం ఆన్లైన్ లో వెతికి, ఏమి పోగొట్టుకున్నాడో తెలుసా?కొందరైతే చెప్పుకోలేక!
చాలామందికి ఎదో ఒక బలహీనత అనేది ఉంటాది. మనిషన్నాక చిన్న చిన్న బలహీనతలు కూడా లేకుండా ఉండటం అంటే కష్టం గాని, కాకపోతే అవి మనల్ని ముంచేసేలా ఉండకూడదు. కొన్ని బలహీనతలతో చేసే కొన్ని పనులు వలన ఒకొక్కసారి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. అందులోనూ ఆన్లైన్ ప్రపంచంలో మనిషికి ఎంత ఆనందం దొరుకుతుందో, అలానే అంత అప్రమత్తంగా లేకపోతే, అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆడ,మగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా జాగ్రత్తగా లేకపోతే మోసపోవడం అనేది ఖాయం.
ఆన్లైన్ లో అమ్మాయి కోసం వెతికి తీవ్రంగా నష్టపోయాడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అంతంత మాత్రం చదువులు ఉన్నవాళ్లు మోసపోయినా అర్ధం ఉంది కానీ, బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకునే వారిని కూడా ఈ సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. దానికి కారణం కేవలం మనలో ఉండే బలహీనతలు, ఆశ మాత్రమే. వాట్సాప్ లో ఈ లింక్ ఓపెన్ చేస్తే డబ్బు వస్తాది లేదా గిఫ్ట్స్ వస్తాయి లేదా మీకు లోన్స్ ఇస్తాము అంటూ అనేక లింక్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని అస్సలు ఓపెన్ చెయ్యవద్దని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూనే ఉన్నారు.
అయినా కూడా ఎందరో ఇంకా ఇలాంటి తప్పులు చేస్తూనే, మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆన్లైన్ లో అమ్మాయి కావాలని వెతికాడు. అతనికి ఒక లింక్ దొరికింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అతనికి ఒక వాట్సాప్ నెంబర్ వచ్చింది. అందులో వాళ్ళు అందమైన అమ్మాయిల ఫోటో లు పంపారు. వాటిలో ఒక అమ్మయిని సెలెక్ట్ చేసుకుని పంపమన్నాడు. దానికి ముందుగా కొంత ఫీజు కట్టమని, ఆ తరవాత ఇంకొక ఫీజు, ఇంకొక ఫీజు చెప్పి మొత్తం 1.97 లక్షలు అతని అకౌంట్ నుంచి లాగేసారు. ఇంతకీ ఆ కాల్ గర్ల్ ని కూడా పంపలేదు. దీనితో గొల్లుమంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా ఎందరికో జరుగుతుంది కానీ కొందరు కంప్లైంట్ ఇస్తారు. కొందరైతే చెప్పుకుంటే పరువు తక్కువని చెప్పుకోలేకపోతున్నారు. అందుకే సైబర్ మోసగాళ్లకు దొరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది.