Ntr wife pranathi: స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత సోషల్ మీడియా భారీ స్థాయిలో అందుబాటులోకి వచ్చింది ప్రతి విషయాన్ని దీని ద్వారా భూతద్దంలో పెట్టి చూద్దాం అలవాటయింది జనాలకు అదేగాక దాని మీద రాద్ధాంతం చేయడం దాన్ని వైరల్ చేయడం ఇలా జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ విషయానికి వస్తే సామాన్య జనాలు కూడా తల దూర్చడం ప్రస్తుతం కామన్ గా మారింది మరికొందరు ఆకతాయిలైతే స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడు దొరుకుతారా వాళ్లని ఎప్పుడు ఏక్తారేద్దామా ? మా ఫ్యాన్స్ ని అంటాడా వీళ్ళ ఫ్యాన్స్ అంటాడా వాళ్ళని రోల్ చేద్దామా అని కాల్చుకొని మరీ ఎదురు చూస్తుంటారు వీళ్ళకి ఇక వేరే పని పాట ఏది ఉండదు . కాస్త ఖాళీ టైమ్ దొరుకుతే చాలు ఇలా చేస్తుంటారు అలాంటి వాళ్లకి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు ఆర్ ఆర్ ఆర్ టీమ్…
మనందరికీ తెలిసిన విషయమే.. మొన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.. దేశం గర్వించదగ్గ విషయం అది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎల్లలు దాటి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మొట్టమొదటిసారిగా భారతీయ చలనచిత్ర రంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డు ఫంక్షన్ కి ఆర్ ఆర్ ఆర్ టీమ్ మొత్తం కదిలి వెళ్ళింది. రాజమౌళి.. రాజమౌళి భార్య రమా రాజమౌళి.. కార్తికేయ.. కార్తికేయ భార్య. రామ్ చరణ్… రామ్ చరణ్ భార్య ఉపాసన.. అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతో కలిసి వెళ్లారు. కానీ ఎన్టీఆర్ మాత్రమే ప్రణతి లేకుండా ఒక్కడే వెళ్ళాడు.
అయితే ఇదే దొరికింది సందు అనుకొని సోషల్ మీడియాలో ఆకతాయిలు దీనిపైన మరింత ఫోకస్ చేయడంతో సోషల్ మీడియాలో దీనిపై ఇంట్రెస్టింగ్ రచ్చ నడుస్తుంది. ఇదే క్రమంలో కొందరు కావాలని ప్రణీతను ఆస్కార్ ఇవ్వడానికి రానివ్వకుండా అడ్డుకున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలాంటిది ఏమీ లేదని ప్రణతికి తన ఆరోగ్యం బాగోలేని కారణంగానే ఈవెంట్ కి హాజరు కాలేకపోయిందని. అందుకే లాస్ట్ మూమెంట్లో ఆమె విరమించుకుందని.. లేకపోతే ఎన్టీఆర్ తో పాటు ఆమె కూడా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి వెళ్లేదని.. టికెట్లు కూడా బుక్ అయ్యాయని.. లాస్ట్ నిమిషంలో ఆమెకు హెల్త్ ఇష్యూ కారణంగానే ప్రణతి డ్రాప్ అయిందని తెలుస్తుంది.
దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. దయచేసి ఎవ్వరు తప్పుడు అర్ధాలు తీయొద్దు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేటిజన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ముందు నుంచే అందరూ ఆస్కార్ అవార్డుకి వైఫ్స్ ని తీసుకువెళ్లాలని ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకున్నారట. పక్కా ప్లాన్ కూడా వేశారని.. కానీ చివరి నిమిషంలో తారకరత్న చనిపోవడం అదే టైంలో ప్రణీత హెల్త్ (Ntr wife pranathi) ఇస్త్యు రావడంతో వెళ్లలేకపోయిందని నందమూరి సన్నిహిత వర్గాల నుండి సమాచారం తెలుస్తుంది.