Home Cinema Nitya Menon : ఊహించని సడన్ దుఃఖంలో నిత్యామీనన్..

Nitya Menon : ఊహించని సడన్ దుఃఖంలో నిత్యామీనన్..

nitya-menon-felt-sad-about-her-grandmother-death

Nitya Menon : ఎంత పెద్ద స్టార్స్ అయినా, సెలబ్రిటీస్ అయినా బంధాలు అనుబంధాలు సామాన్యుల్లానే ఉంటాయి. ప్రపంచంలో ఎంత టెక్నాలజీ పెరిగిన, వృత్తిపరంగా మనిషి ఎంత బిజీ అయినా తనకంటూ కొన్ని బంధాలు ( Nitya Menon felt sad ) ఉంటాయి. అవి ఎంత దూరంలో ఉన్నా, ఎలా ఉన్నా మనసు వాటికోసం తపిస్తూ ఉంటుంది. అలా తపించే మనసులోంచి అవతల వాళ్ళు దూరం అయ్యారు అనగానే ఒక్కసారిగా ఎంతో బాధ కలుగుతుంది. అలాంటి బాధలోనే ఇప్పుడు నిత్యామీనన్ ఉంది. నిత్యామీనన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ మరణించింది. ఆమె మరణం ఎంతో బాధగా ఉందంటూ నిత్యామీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

nitya-menon-felt-sad-about-her-grandmother-death

నిత్యామీనన్ సోషల్ మీడియాలో తన అమ్మమ్మ పై ఉన్న ప్రేమని ఇలా వ్యక్తపరిచింది. ఒక శకం ముగిసింది.. ఐ మిస్ యు అమ్మమ్మ.. గుడ్ బాయ్ అమ్మమ్మ.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. ఇప్పటినుంచి నిన్ను మరో కోణంలో చూసుకుంటాను అంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ( Nitya Menon felt sad ) తర్వాత నిత్యామీనన్ అభిమానులు అందరూ నిత్యామీనన్ ఎంత బాధ పడుతుందో ఊహించి చాలా బాధపడుతున్నారు. నిత్యామీనన్ ని ధైర్యంగా ఉండమని.. వాళ్ళ అమ్మమ్మ ఆశీస్సులు ఆమెకి ఎప్పుడూ ఉంటాయని.. మనసులో ఎప్పుడూ ఆవిడ జీవించే ఉంటుందని.. బాధపడద్దని నిత్యా మీనన్ కి మెసేజ్ లు పెడుతున్నారు అభిమానులు.

See also  Custody: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సారి హిట్ కొట్టడానికి ఫుల్ జోష్ మీద వస్తున్నాడు చైతు

nitya-menon-felt-sad-about-her-grandmother-death

అయితే మరికొందరు అమ్మమ్మ అంటే చాలా పెద్దదే ఉంటుంది కదా.. ఆవిడ మరణిస్తుందని ఎలాగైనా అనుకుంటారు గా దానికి అంతెందుకు బాధపడుతుంది అని అంటే.. నిత్యామీనన్ వాళ్ళ అమ్మమ్మ గురించి అంతగా బాధపడడానికి రీజన్ అయితే ఉందంట. నిత్యామీనన్ హీరోయిన్ అవుతానని అనుకున్నప్పుడు.. వాళ్ళ ఇంట్లో ఎవరూ కూడా ఆమెను నమ్మలేదంట. నిత్యమీనన్ హీరోయిన్ కాలేదని, అసలు అలాంటి ప్రయత్నం ( Nitya Menon felt sad ) అనవసరమని అనేవారట. కానీ వాళ్ళ అమ్మమ్మ మాత్రం నిత్యామీనన్ కి పూర్తి సపోర్ట్ ఇచ్చిందంట. కచ్చితంగా హీరోయిన్ అవుతుందని.. తన కాళ్ళ మీద తన నిలబడుతుందని.. తాను అనుకున్నది సాధించి తీరుతుంది అని ఎంతో నమ్మకాన్ని, కాన్ఫడెన్సు ను ఇచ్చిందంట. అలా తన శరీరంలోకి అడుగుపెట్టడానికి వాళ్ళ అమ్మమ్మ ముఖ్యమైన కారకురాలట.

See also  Allu Arjun : పెళ్లి అయిన ఆ హీరోయిన్ మీద అలాంటి ఇష్టం పెట్టుకున్న అల్లు అర్జున్!

nitya-menon-felt-sad-about-her-grandmother-death

అందుకే నిత్యమీనన్ కి వాళ్ళ అమ్మమ్మతో మంచి రిలేషన్ ఉంటుందంట. ప్రతిదీ వాళ్ళ అమ్మమ్మతో షేర్ చేసుకుంటుందట. వాళ్ళ అమ్మమ్మతో మంచి అనుబంధం కలిగి ఉందంట. దాని వలన ఆమె మరణం చాలా బాధను కలిగించిందంట. ఐ లవ్ యు అమ్మమ్మ అంటూ ఆమె ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిత్యమీనన్ ఎంత సింపుల్గా, సున్నితంగా కనిపిస్తుందో.. ఆమె మనసు కూడా అలాంటి సున్నితమైనదేనని.. అందుకే ఇంత స్టార్ అయినప్పటికీ కూడా ఆమె అతి సామాన్యంగా ఒక వృద్ధురాలి వాళ్ళ అమ్మమ్మ మరణానికి ఇంతగా స్పందిస్తూ తన బాధను తెలియపరుస్తుందని ఆమె అభిమానంలో ఆమెను ఎంతగానో కొనియాడుతున్నారు..