Home Cinema Nidhhi Agerwal: ఏ ఒక్కరికీ సరిగ్గా నటించే సత్తా లేదని నిధి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Nidhhi Agerwal: ఏ ఒక్కరికీ సరిగ్గా నటించే సత్తా లేదని నిధి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Nidhhi Agerwal Comments Viral: తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య చిత్రం సవ్యసాచిలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు.. తన అందం అభినయంతో నటించిన అతికొద్ది చిత్రాలే అయినప్పటికీ.. కుర్రకారులకు సెగలు పుట్టిస్తూ మతులు పోగొడుతూ ఆమె అందంతో ఇట్టే అందర్నీ తన వైపుకు లాగేసుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె పేరుకు తగ్గట్టే ఆమెకు తగ్గట్టే ఆమె పేరు పెట్టారు. పేరులోనే నిధి దాచుకుంది నిధి అగర్వాల్ ఆ నిధి ఏంటంటే తన అందం..అందాల నిధి. ఇక తెలుగులో నటించిన మొదటి చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న తర్వాత తను తన తదుపరిచిత్రం నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో కూడా నటించినప్పటికీ అంతగా ఆదరించలేదు.

See also  Prabhas : అదిరిపోయే వార్త.. ప్రభాస్ కి ఆమెతో పెళ్లి కి ప్లేస్ కూడా ఫిక్స్..

nidhhi-agerwal-no-one-knows-how-to-act-properly-comments-viral

ఇక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అంతగా ఫలితాలు ఇవ్వకపోగా అందర్నీ అలరించలేకపోయింది.. తర్వాత సరైన టైమ్ కి.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇక తర్వాత అందరూ అనుకున్నారు ఈ అమ్మడు టాలీవుడ్ లోనే ఓ వెలుగు వెలుగుతుందని భావించారు. ఇస్మార్ట్ శంకర్ లో తన అందాల ఆరబోత తర్వాత టాలీవుడ్లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రాబోతున్న చిత్రం హరహర వీరమల్లు లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం హిస్టారికల్ గా మన ముందుకు రాబోతుంది. ఇందులో నిధి అగర్వాల్ యువరాణి క్యారెక్టర్ లో నటించనుంది.

See also  Singer Chinmayi: సమంత కాపురం కూలిపోవడానికి సింగర్ చిన్మయి కారణమా.? వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

nidhhi-agerwal-no-one-knows-how-to-act-properly-comments-viral

దాదాపు ఈ చిత్రం గత మూడు సంవత్సరాల నుండి నత్త నడకన షూటింగ్ పనులు సాగుతున్నాయి. ఇటీవలే ఈ షూటింగ్లో పాల్గొన్న నిధి పై రకరకాల ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆశించిన స్థాయిలో పెద్ద హిట్టు తగ్గకపోవడంతో ఇంత అందంగా ఉన్నప్పటికీ నిధిని బ్యాడ్ లక్ బ్యూటీ అని టోల్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకున్న నిధి వీటిపై స్పందించింది. నటన విషయంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ నేనే కాదు నటన గురించి పూర్తిగా తెలిసిన వారెవరు కూడా లేడు అంటూ ఆ మాటలను ఖండించింది. (Nidhhi Agerwal Comments Viral)

See also  Ram Charan daughter : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో తెలిస్తే రచ్చ రచ్చే..

nidhhi-agerwal-no-one-knows-how-to-act-properly-comments-viral

అదేవిధంగా దీనిపై స్పందిస్తూ.. నటన గురించి అన్ని విషయాలు అందరికీ తెలియవు. మరదే విధంగా తన నటనకు నేను మెరుగులు దిద్దుకుంటున్నట్లు తాను చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటినుంచి కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక నటన విషయంలో ఎవరికీ పూర్తి పరిజ్ఞానం లేదని తాను తెలిపింది తాను కూడా నటన నేర్చుకుంటున్నానని కూడా దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ వెల్లడించింది. దాంతో ఈ మాటలు అన్నందుకు మళ్లీ ఈమెను కొందరు టూల్స్ చేయడం మొదలుపెట్టారు.