Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దర్శకుడిగా ఆయన సృష్టించిన సెన్సేషన్స్ ఎన్నేళ్లు అయినా, ఎన్నాళ్ళైనా ఎవరు మరువలేరు. శివ సినిమాతో.. సినిమా ( Comments on RGV and Rajamouli ) ఇండస్ట్రీలో ఒక కొత్తరకం ట్రెండ్ ని సృష్టించాడు. సినిమాలో విలన్ పాత్ర ఎంత ఘోరంగా ఉండొచ్చు అంటే.. విలన్ ఎటువంటి పెద్ద పెద్ద ఫైట్స్ చేయకుండా, పెద్ద పెద్ద మీసాలు లేకుండా, పెద్ద బాడీ బిల్డింగ్ లేకుండా.. కేవలం మాటలతో భయాన్ని ఎలా సృష్టించచ్చో చూపించిన దర్శక హీరో రామ్ గోపాల్ వర్మ. ప్రేమకథా చిత్రాల్లోనే మంచి పేరు తెచ్చుకొని, దానికే ఎక్కువగా ఆ వంశంలో వారు పనిచేస్తారని అన్నటువంటి అక్కినేని కుటుంబం నుంచి.. అలాంటి వైలెంట్ సినిమాల్లో కూడా ఎక్సలెంట్ గా నటించే సెన్సేషన్ క్రియేట్ చేయగలడని నాగార్జునతో.. అలాంటి నటన నటింపజేయడం అంటే నిజంగా అది రాంగోపాల్ వర్మ గొప్పతనం అని ఖచ్చితంగా చెప్పుకోవలసిన విషయం.
అలాగే రాంగోపాల్ వర్మ ఆలోచన విధానం, ఆయన సినిమాలు తీసే స్టైల్, ఆయన సినిమాల్లో హీరోయిన్ ని చూపించే విధానం, రొమాన్స్ చూపించే విధానం ఇవన్నీ కూడా ఇప్పటి జనరేషన్ లో తీసే సినిమాల కంటే ఇంకా ( Comments on RGV and Rajamouli ) ఫాస్ట్ గా అప్పట్లోనే అతను తీశాడు. హీరో హీరోయిన్స్ ఎంపిక గాని, ఒక సినిమాని నేషనల్ లెవెల్ లో అందరూ చూడాలంటే దానికి ఎలాంటి ప్లాన్ తో చేయాలనేది రామ్ గోపాల్ వర్మ కి వెన్నతో పెట్టిన విద్య లా సినిమాని తీయగలడు. అప్పట్లో పాన్ ఇండియా సినిమా అనేది లేదు గాని.. ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలు గా ప్రసిద్ధి చెందుతుంటే.. అప్పట్లో ఈ పని రామ్ గోపాల్ వర్మ చేసేసాడు. ఆయన తీసిన రంగీలా సినిమా శివ ఇలా ఎన్నో సినిమాలు పాన్ ఇండియా వేదికగా రిలీజ్ చేసి ఉంటే పాన్ ఇండియా క్రెడిట్ ని రాంగోపాల్ వర్మ కచ్చితంగా సంపాదించుకునేవాడని నెటిజనులు అంటున్నారు.
రాంగోపాల్ వర్మ ఒక సెన్సేషన్ డైరెక్టర్ గా మిగిలిపోవడమే కాకుండా.. ఆయన మంచి మంచి ట్యాలెంట్ ఉన్న శిష్యులను తయారు చేసి.. దర్శకులుగా సినిమా రంగానికి అందించారు. కృష్ణవంశీ, పూరి జగన్నా, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగస్త్య వంటి వాళ్ళందరూ రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యులే. ఆయన శిష్యులు అద్భుతమైన సినిమాలను తీస్తూ సక్సెస్ను అందుకుంటూ వస్తున్నా కూడా.. కొంత కాలం నుంచి రాంగోపాల్ వర్మ ( Comments on RGV and Rajamouli ) ఫెయిల్యూర్స్ తో అనేక విమర్శలతో ఆయన కెరియర్ సాగుతూనే ఉంది. ఎన్ని సినిమాలు ఫెయిల్ అయినా.. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన మాట్లాడే మాట గాని, ఆయన తీసే సినిమాలు గాని, ఆయన ఆలోచనలు గాని అన్ని సెన్సేషన్ గానే ఉంటాయి. దానిమీద ఎప్పుడు అభిమానులు ఫోకస్ పెడుతూనే ఉంటారు. ఆయన్ని ఎప్పటికీ సైడ్ కి తోయకుండా.. ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా.. ఆర్జీవీ ని ఒక గొప్ప దర్శకుడు స్థానంలోనే ఉంచి చూస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆర్జీవి నిజం అంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని వీడియోస్ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ వీడియోలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. అప్పట్లో నాకు, ఊర్మిలాకి అఫైర్ ఉందంటూ ఒక ప్రముఖ పత్రిక రాసింది. ఆ విషయం తెలుసాక నేను రహస్యంగా అమీర్పేట వెళ్లాను. అక్కడ అమీర్పేటలో నేను చూడకూడనిది చూశాను అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు నా మీద విపరీతంగా వస్తున్నాయి. ఇలాంటి వార్తలు రాయడం వెనక కారణమేమిటంటే.. వాళ్ళు ఫేమస్ అవడం గురించి అయినా అయ్యుండొచ్చు లేదా ఇలాంటి వార్తలు చెప్పుకుంటూ డబ్బు సంపాదించుకోవడం కోసమైన అయ్యి ఉండచ్చు అన్నారు. ఇదంతా ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందని.. లేనిపోని వార్తలను సృష్టించి రాయడం అనేది డబ్బు కోసం, ఫేమ్ కోసమే చేస్తున్నారని.. రామ్ గోపాల్ వర్మ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.