
Sri Reddy – Abhiram : తేజ దర్శకత్వంలో, దగ్గుబాటి అభిరామ్ హీరోగా, గీతికా తివారి హీరోయిన్ గా రూపొందిన అహింస చిత్రం జూన్ రెండవ తేదీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దగ్గుబాటి వారసుడి తొలి సినిమా కావడం.. పైగా తేజా లాంటి మంచి దర్శకుడు చేతిలో ఈ సినిమా రూపొందడం.. కొత్త నటుల్ని ( Comments on Abhiram and Sri Reddy ) సినిమా రంగానికి ప్రేమకథా చిత్రాల ద్వారా అందించే సూపర్ డూపర్ హిట్స్ కొట్టే తేజా లాంటివాడు చేతితో ఈ సినిమా జరగడం.. వీటన్నిటిపై ఆడియన్స్ బాగానే అంచనాలను పెంచుకున్నారు. అంచనాలతోనే సినిమాకి వెళ్లడం జరిగింది. అయితే సినిమా.. ప్రేక్షకుడి అంచనాలను రీచ్ కాలేకపోయింది. తేజ ఒకప్పటి 20 ఏళ్ల క్రితం ఎలాంటి ట్రెండ్ తో సినిమాలు తీశాడో..
అదే ట్రెండ్ తో ఇప్పుడు కూడా సినిమా చేసి సక్సెస్ సాధించాలనుకోవడం చాలా అమాయకత్వంగా అనిపించింది ఆడియన్స్ కి. దానితో ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎప్పుడైతే ఆడియన్స్ ఫ్లాప్ ఇచ్చారో సినిమా డిజాస్టర్ గా మారింది. అయితే ఒకప్పుడు శ్రీరెడ్డి.. అభిరామ్ దగ్గుబాటి పై ఎన్నో ఆరోపణ చేసింది. అప్పట్లో వీళ్ళిద్దరూ ( Comments on Abhiram and Sri Reddy ) చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వాట్సాప్ మెసేజ్ లు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అతన్ని చాలా వరకు డ్యామేజీ చేసుకుని వచ్చింది. దాని వలన అభిరామ్ అనగానే.. అందరికీ శ్రీ రెడ్డి గుర్తుకు వస్తుంది. అలా శ్రీ రెడ్డి ఆరోపణలు చేసిన అభిరామ్.. ఇప్పుడు హీరోగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి.. తన కెరియర్ ని నిలబెట్టుకునేందుకు..
ఎంతో కష్టపడి సినిమాలలో తన వంతు పని చేసుకుని వెళ్లాడు. కానీ ఎందుకో సినిమా మాత్రం జనాలకు ఎక్కలేదు. అయితే ఈ సినిమా గురించి నెట్ లో మాట్లాడుకుంటూ.. అభిరామ్ ఎంతో కష్టపడి ఈ సినిమా చేసినప్పటికీ.. తేజ మనసు పెట్టి దర్శకత్వం చేసినప్పటికీ.. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి శ్రీ రెడ్డి ఉసిరే తగిలి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఆఫర్ల కోసం శ్రీ రెడ్డి అలాంటి దారిని వెతుక్కోవడం ( Comments on Abhiram and Sri Reddy ) కూడా తప్పే కదా.. దానికి కేవలం అభిరామ్ ని మాత్రమే అనుకోవాల్సిన పనేముంది అని మరికొందరు అనుకుంటే.. ఏది ఏమైనా ఆడదానితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ ఉసురు గట్టిగానే తగులుతుందని ఇంకొందరు అనుకుంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే.. వీళ్లిద్దరి సమస్యతో అసలు ఎటువంటి రిలేషన్ లేని వ్యక్తి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీయర్ని గట్టిగా నాటుకోవాలనుకున్న గీతిక తివారి.. పాపం ఎంతో కష్టపడి ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది గాని.. సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. తను ఖాతాలో కూడా డిజాస్టర్ సినిమాని వేసుకోవాల్సి వచ్చిందని.. అభిరామ్ కి శ్రీరెడ్డి ఉసిరు తగిలి సినిమా ఫ్లాప్ అయితే.. అభిరామ్ వల్ల ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి తన కెరీర్ కి దెబ్బ తింటే.. గీతికా తివారి ఉసురు కూడా అభిరామ్ కి తగులుతుందా అంటూ నెటిజన్ వ్యంగంగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా అయితే హిట్ లేదా ఫ్లాప్ అవుతాది. దానికి ఒకరిని ఇంకొక బ్లేమ్ చేసుకోవడం అనవసరం..