Home Cinema Trisha – Animal : త్రిష కొంపముంచిన అనిమల్ సినిమాలో ఆ సీన్స్..

Trisha – Animal : త్రిష కొంపముంచిన అనిమల్ సినిమాలో ఆ సీన్స్..

netizens-comment-on-trisha-about-her-opinion-on-animal-movie

Trisha -Animal : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినీ అభిమానుల్లో అందరిలో జరుగుతున్న డిస్కషన్ అనిమల్ సినిమా గురించే.. అనిమల్ సినిమాని సంపూర్ణంగా పొగడ లేకపోతున్నారు, సంపూర్ణంగా వదులుకోలేకపోతున్నారు, సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమాని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే వైపు చూస్తే ఏది చేసినా ముందు ( Trisha opinion on Animal movie ) సినిమా చూడాలి అనే స్థితిలో అందరిని పెట్టాడు. నిజంగా ఈ సినిమాలో హీరో అంటే సందీప్ రెడ్డి వంగానే.. ప్రతి ఆర్టిస్టుతో తను అనుకున్న ఆలోచనలని, తన చేయించాలనుకున్న ప్రతి భావాన్ని సంపూర్ణంగా వాళ్లతో చేయించి.. ఊహించని సక్సెస్ ని అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.

comments-on-trisha-about-Animal-movie

ఈ సినిమా కలెక్షన్స్ సునామీలా కురుస్తుంది. మూడు రోజుల్లో భయంకరమైన కలెక్షన్స్ ని అందుకుంది. మరోపక్క ఈ సినిమాపై సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ( Trisha opinion on Animal movie ) ఈ సినిమాని చూడడం, దానిపై వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉండడం జరుగుతుంది. వీకెండ్లో సినిమాపై హైప్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే డైలాగ్స్ లేకుండా పోయింది. వీకెండ్ అయిపోయినా కూడా అదే విజయంతో, అదే స్పీడ్ లో దూసుకుపోతుంది అనిమల్ సినిమా. దీని తర్వాత రాబోయే సినిమాలకు గాని ఈ సినిమాని మించేలా లేకపోతే.. అవి మునిగిపోతాయేమో అన్నంత భయంకరంగా కూడా పరిస్థితి ఉంది.

See also  Trisha: ఆ పని చేయడం వల్లే నలభై ఏళ్ల వయసులో కూడా త్రిషకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా.?

comments-on-trisha-about-Animal

ఇలా ఉంటే త్రిష.. అనిమల్ సినిమాపై తన సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. అనిమల్ సినిమాపై త్రిష పాజిటివ్గా కామెంట్ చేయడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా తిరగబడుతున్నారు. మన్సూర్ చేసిన కామెంట్స్ గురించి ఆమె విపరీతంగా రియాక్ట్ అయిపోయి.. స్త్రీ జాతికి గౌరవం ఇవ్వాలి అంటూ.. అతను ఉన్న సినిమాల్లో ( Trisha opinion on Animal movie ) ఇకమీదట సినిమాలు నటించనని స్టాండ్ తీసుకొని అతనిపై విపరీతంగా విరుచుకుపడ్డ త్రిష.. ఇప్పుడు అనిమల్ సినిమా లాంటి సినిమాని ఎలా పొగుడుతుంది అంటూ కొందరు తిరిగి ప్రశ్నల వేస్తున్నారు. అనిమల్ సినిమాలో స్త్రీని అగౌరపరచడం గాని అలాగే గృహహింస గాని ఇలాంటివి ఉన్నాయని.. వాటిని పట్టించుకోకుండా ఆ సీన్స్ గురించి ఆమె రియాక్ట్ అవకుండా తిరిగి సినిమాని పొగడటమేంటని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ లావణ్యల ఎంగేజిమెంట్ ఆ స్పెషల్ డే లోనే ఫిక్స్.. ఎవరి ఆధ్వర్యంలోనో తెలుసా?

comments-on-trisha-about-Animal-movie-netizens

దీనితో ఆమె తన సోషల్ మీడియా నుంచి తన పోస్టుని తీసేసింది. అయినా కూడా ఆ స్క్రీన్ షాట్ ని పెట్టుకొని మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. పాపం త్రిష తన సినిమాపై మన్సూర్ చేసిన కామెంట్స్ కి ఆమె రియాక్ట్ అయిన విధానానికి.. ఇప్పుడు ఈ సినిమా చూసి ఈ సినిమా పై ఆమె చెప్పిన ఒపీనియన్ కి సంబంధం ఏముంది? అసలు ఎటువంటి సంబంధం లేనిదాన్ని కలిపి కావాలని అందరూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు తప్పా.. ఇందులో త్రిష చేసిన మిస్టేక్ ఏమీ లేదని మరికొందరు నెటిజనులు గట్టిగానే ఇచ్చుకుంటున్నారు. ఏదేమైనా మొత్తానికి అనిమల్ సినిమా త్రిష కొంప ముంచింది అంటూ కొందరు సింపుల్గా నవ్వి వదిలేస్తున్నారు.