Home Cinema Trivikram – Gunasekhar : నీతులు గొప్పగా చెప్పే ఈ గురూజీ ఇంత గోరంగా వెన్నుపోటు...

Trivikram – Gunasekhar : నీతులు గొప్పగా చెప్పే ఈ గురూజీ ఇంత గోరంగా వెన్నుపోటు ఎలా పొడిచాడు?

netizen-comments-on-directors-trivikram-and-gunashekar

Trivikram – Gunasekhar : ఏదైనా ఒక సినిమా తీయాలంటే మొదట మూలం కథ అని అందరికీ తెలిసిందే. కథ అనేది ఒకటి రెడీ అవ్వాలంటే.. ముందు ఒక ఆలోచన మొదలవ్వాలి. ఆ ఆలోచన కథల రాసుకోవాలి. అలా మొదలైన ( Directors Trivikram and Gunashekar ) ఆ కథని నిర్మాతలకు, హీరోలకు చెప్పి.. వాళ్ళని ఒప్పించి.. ఆ తర్వాత దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తారు రచయితలు, దర్శకులు. అందుకే ప్రతి దర్శకుడు తన కథ అంటే అందులో తన క్రియాటివిటీని పెడతాడు. తన తయారు చేసుకున్న ఆలోచనను అందరికీ చూపించి మెప్పు పొందాలని ఆశపడతాడు. అలాంటి కథ, అలాంటి ఆలోచన తనది తనకి కాకుండా పోయి.. ఇంకొకటి ఏదో అయితే ఆ దర్శకుడుకి కలిగే బాధ అంతా ఇంతా కాదు .అలాగే గుణశేఖర్ కూడా ఇప్పుడు బాధపడుతున్నాడెమో అనిపిస్తుంది.

netizen-comments-on-directors-trivikram-and-gunashekar

అమెరికాలో కామిక్ కాన్ ఫిలిం ఫెస్టివల్లో రానా దగ్గుపాటి ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో చాలా సంవత్సరాల నుంచి చర్చలో ఉంది. అదేంటంటే.. హిరణ్య కశ్యప. ఈ హిరణ్య కశ్యప గురించి చాలా కాలంగా టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు ( Directors Trivikram and Gunashekar ) రానా దగ్గుపాటి. ఈ ప్రాజక్ట్ గురించి అనౌన్స్ చేయడమే కాకుండా.. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందిస్తున్నాడని కూడా అక్కడే రానా చెప్పాడు. ఎప్పుడైతే రానా ఈ అనౌన్స్ చేశాడో.. అప్పటినుంచి నెటిజనులులందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే హిరణ్య కశ్యప అనే సినిమాను గుణశేఖర్ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటిది ఆ సినిమాను ఇప్పుడు అనౌన్స్ చేసే క్రమంలో అందులో గుణశేఖర్ పేరు ఎక్కడా లేదు. పైగా రానా ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ అందరి దృష్టిని తన ట్వీట్ తో తన వైపు మళ్ళించాడు.

See also  Allu Arjun : ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన పిల్లలు ఇద్దరికీ ఏం చూపిస్తున్నాడో తెలుసా?

netizen-comments-on-directors-trivikram-and-gunashekar

దేవుడి మీద సినిమాలు తీయడం ఓకే గానీ.. మనం నైతికంగా ఏదైనా చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడని మరిచిపోవద్దు అంటూ గుణశేఖర్ ఒక ట్వీట్ చేశాడు. అయితే అందరూ కూడా ఈ ట్విట్ లో మీనింగ్ వెతుక్కున్నారు. త్రివిక్రమ్ కె ఈ కామెంట్ చేశాడని అందరూ అనుకుంటున్నారు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా ( Directors Trivikram and Gunashekar ) చేద్దామని అనుకున్నాడు. రుద్రమదేవిలో ముఖ్యపాత్ర చేసిన రానా దగ్గుబాటినే లీడ్ రోల్ కి తీసుకోవాలనుకున్నాడు. అందుకే సురేష్ ప్రొడక్షన్ కి కథ చెప్పి.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. కొన్ని రోజులు తరవాత గుణశేఖర్ ఆ ప్రోజక్ట్ నుంచి తప్పుకున్నాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో కురుశేఖర్ మాట్లాడుతూ.. హిరణ్యకశ్యప సినిమాకి శ్రీకారం చుట్టింది తానేనని.. దానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.

See also  Anasuya Bharadwaj: ఎంతో మంది ఇండస్ర్టీలో ఉన్నా..!! అనసూయనే ఆంటీ అంటున్నారు ఎందుకో తెలుసా.?

netizen-comments-on-directors-trivikram-and-gunashekar

అంతేకాకుండా ఆ ప్రాజెక్టు లోకి త్రివిక్రమ్ ఎలా వచ్చాడో కూడా అతను చెప్పాడు. సాయిమాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్‌గా తీసుకున్నానని.. కానీ త్రివిక్రమ్ తనకు తానుగా ఈ చిత్రానికి మాటలు రాస్తానని ముందుకు వచ్చాడని.. అయితే సరే అని అనుకున్నానని.. కానీ తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే.. త్రివిక్రమ్ రచయితగా ఈ ప్రాజెక్టులో ప్రవేశించి.. మొత్తం స్క్రిప్ట్ మీద కంట్రోల్ తెచ్చుకొని.. ఆ క్రమంలో గుణశేఖర్ని ప్రాజెక్ట్ నుంచి బయటకు తప్పించేలా చేశాడని అనిపిస్తుంది. దీనితో ఇంటర్వ్యూ చూసి.. మరోపక్క రానా అనౌన్స్మెంట్ చూసి.. నెటిజనులు త్రివిక్రమ్ ని బాగా తిట్టుకుంటున్నారు. నీతులు గొప్పగా చెప్పుకునే గురూజీ ఇంత దారుణంగా వెన్నుపోటు ఎలా చేసాడు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.