Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న గుంటూరు కారం సినిమాపై మహేష్ బాబు అభిమానులందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అవ్వగానే విపరీతమైన ( Guntur Kaaram song ) క్రేజ్ పెరిగింది. మహేష్ బాబు లుక్కు గాని ఆయన షర్టు గాని ప్రతిదీ కూడా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈరోజు గుంటూరు కారం సినిమా నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు.
తమన్ సంగీత దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలోని పాట రిలీజ్ చేశారు. ఆ పాట.. కొందరైతే త్రివిక్రమ్ ఆలోచన తగ్గట్టు మాస్ ఎంటర్టైనర్గా సాంగ్ అదిరిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నప్పటికీ.. చాలామంది నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ( Guntur Kaaram song ) పాటతో ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. అసలు పాటలో దమ్ము లేదని.. పాట ఏ మాత్రం క్యాచీగా లేదని.. సాంగ్ పెద్దగా అసలు నచ్చలేదని.. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ బాబు అభిమానులైతే ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురు చూస్తుంటే.. ఇలాంటి సమయంలో ఈ పాట చూసి ఎక్కడో ఒక మూల భయం మొదలైంది అన్నట్టు నిరాశపడ్డారు.
మహేష్ బాబు ఎంట్రీ మీద, ఆయన క్యారెక్టర్ మీద రాసిన ఈ సాంగ్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగానే ఉంది అనిపించింది. అది కూడా పెద్ద గొప్పగా అనిపించకపోయినా కనీసం కొంతవరకు మహేష్ బాబుకు రిలేటెడ్ గా సాహిత్యాన్ని రాశాడని అనిపిస్తుంది. ఒక మోస్తరుగా ఉంది.. అయితే సంజిత్ హెగ్డేతో కలిసి సంగీత దర్శకుడు ( Guntur Kaaram song ) తమన్ ఈ పాటను పాడాడు. పాట పాడిన తీరు కూడా పెద్దగా లేదు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ ఈ పాట కోసం వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఏది ఎవరికీ నచ్చలేదు. డప్పు వాయిస్తున్నట్టు చాలా చిరాగ్గా ఉందని అంటున్నారు. తమన్ ఎందుకు ఇంత దారుణమైన మ్యూజిక్ ని అందించాడు? త్రివిక్రమ్, మహేష్ బాబు అంత కష్టపడుతుంటే.. ఈ సినిమాని తమన్ ఎక్కడికి తీసుకు వెళ్తాడు అంటూ విపరీతంగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యంలో బుర్రిపాలెం బుల్లోడు అంటూ మహేష్ బాబు సొంత ఊరుని గుర్తుకు తీసుకురావడం కొంతవరకు అభిమానులకు నచ్చింది. నేను నిశ్శబ్దం.. అనునిత్యం నాతో నాకే యుద్ధం అనే లైన్లు కూడా కొంతవరకు బాగా నచ్చాయి. కానీ పాట మాత్రం నోటికి క్యాచీగా అసలు లేదు. పాడిన విధానం బాలేదు. మ్యూజిక్ డైరెక్షన్ బాలేదు. కోరస్ కూడా పాట తర్వాత చివరలో వచ్చిన కోర్స్ కూడా తమన్ ముందు సినిమాల్లో చూసి కాపీ కొట్టినట్టే అనిపిస్తున్నాయి. అలవైకుంఠపురంలో మ్యూజిక్ గుర్తుకు తీసుకొచ్చింది. కానీ ఇలాగ తమన్ ఇంత దారుణమైన మ్యూజిక్ ని అందిస్తాడని గాని ఎవరు ఊహించలేదు అని అభిమానులు సినీ అభిమానులు అందరూ కూడా బాగా తిట్టుకుంటున్నారు. మరి ఈ పాట మీరు కూడా విని మీ ఉద్దేశం ఏంటో కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి నచ్చొచ్చు.. ఇంకొకరికి ఎందుకో నచ్చకపోవచ్చు.