నరేష్, పవిత్రల లిప్ కిస్ వీడియో రిలీజ్ చెయ్యడానికి అసలు కారణం ఇదేనంట…
సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఒకరోతో ఒక్కరికి స్నేహం, ఎఫ్ఫైర్స్ లాంటివి ఉండటం చాలా సహజం. కొందరు పెళ్లి వరకు వెళ్తే, మరికొందరు ఉన్న పెళ్లిని రద్దు చేసుకునే వాళ్లు ఉంటారు. ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో వీళ్ళు కూడా ఒకరిని ఒకరు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఈరోజుల్లో కామన్ అయినప్పటికీ సెలబ్రెటీస్ అవ్వడం వలన సినిమా రంగంలో ఎవరి మధ్య ఏమున్నా, లేకున్నా కొంచెం అనుమానం కలిగినా, వెంటనే మీడియాలోకి ఆ వార్తలు గుప్పుమని అంటాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి.
ఈమధ్య కాలంలో నరేష్, పవిత్ర ల గురించే ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదని, మంచి స్నేహం మాత్రమే ఉందని నరేష్ మరియు పవిత్ర చెబుతూ వచ్చారు. అయినా కూడా కొన్ని వెబ్సైట్స్ వదలకుండా వారి పై రాసిన వార్తలు గురించి వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నరేష్ కి ఇప్పటికే 3 పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ భార్యతో ఇంకా విడాకులు కూడా అవ్వలేదని ప్రచారం ఉంది. అయితే నరేష్ మూడవ భార్య రమ్య… నరేష్ మరియు పవిత్రలను మైసూర్ హోటల్ రూమ్ లో పట్టుకుని, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా జరిగింది.
సూపర్ స్టార్ కృష్ణగారి మరణం సమయంలో కూడా, వీరి జంట దగ్గరగా కనబడటంతో మళ్ళీ వీళ్ళ పై అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు వ్యతిరేకంగా పవిత్ర లోకేష్ సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు నరేష్, పవిత్రల వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. 2023 న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళిద్దరూ అందరికి విషెస్ చెబుతూ ఒక వీడియో ని పబ్లిష్ చేశారు. ఆ వీడియో వీళ్ళ రిలేషన్ ని ఒక కోణంలోకి తీసుకుని వెళ్ళింది. వీడియో లో న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ, కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకుని ఆ తరవాత లిప్ కిస్ చేశారు. త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు.