Nani – Nithin : డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సినిమాల సందడి మొదలైపోయింది. డిసెంబర్ 1వ తేదీన అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి.. ఈనెల అందరిని ఒక్కసారిగా సినిమాల వైపు చూసేలా చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ గురువారం నాడు హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయింది. హాయ్ నాన్న సినిమా కుటుంబ కథా ( Nani and Nithin ) చిత్రంగా, ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా, కుటుంబ కథ చిత్రాన్ని చూడాలనుకునే సినీ అభిమానులందరికి కూడా ఈ సినిమా బాగానే సంతృప్తి పరుస్తుందని ఆశతో అందరూ ఎదురు చూసారు. అయితే ఆరోజు వచ్చేసింది.. ఈరోజు రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెంటిమెంట్, ఎమోషన్ లో అదరగొట్టిందనిపించింది.
అయితే సినిమా కొంత స్లోగా ఉందని కూడా టాక్ అయితే వస్తుంది. ఓపిగ్గా, సహనంగా చూస్తే సినిమా నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం మంచి ఫీల్ తో బయటకు వస్తారని అనిపించింది. దర్శకుడు సినిమాని చివరి స్థాయికి వచ్చేసరికి ప్రేక్షకుడిని ఎలా సాటిస్ఫై చేయాలి అనే క్రమంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడని ( Nani and Nithin ) అంటున్నారు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చాలా బాగా నటించిందని.. నాని కూతురుగా నటించిన కియారా చాలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిందని అంటున్నారు. కాకపోతే కొన్ని పాత సినిమాలలో సీన్స్ తో పోల్చినప్పటికీ.. ఒక కొత్త ఎమోషన్ ని క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడని రివ్యూస్ వస్తున్నాయి.
అయితే రేపు నితిన్ సినిమా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై నితిన్ అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ట్రైలర్ చూస్తే సినిమాలో మంచి కామెడీ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై కూడా కొన్ని కామెంట్స్ సినిమా రిలీజ్ ముందు నుంచి వస్తున్నాయి. నితిన్ సినిమా కేవలం ( Nani and Nithin )కామెడీ ఏదో ఉంటుంది తప్పా, ఇంక ఏ సినిమాలో అంతకుమించి సత్తా ఏమీ ఉండదని అంటున్నారు. ఈ సినిమా లేకపోతే ఏదో టైం పాస్ కోసం చూడాలి తప్పా.. ప్రత్యేకించి చూడాల్సిన గొప్ప సినిమా గా ఉండదని అనుకుంటున్నారు. రేపు సినిమా రిలీజ్ ఉందనుగా ఇప్పుడు ఇలాంటి టాక్ రావడం నిజంగా నితిన్ సినిమాకి బ్యాడ్ లక్ అని అనుకోవాలి. కానీ ఇలాంటి టాక్ లను పూర్తిగా నమ్మడానికి ఏమీ లేదు. ఎందుకంటే.. సినిమా చూసిన తర్వాత వచ్చిన రివ్యూస్ మాత్రమే వాల్యూ ఉంటుంది.
అసలే డిసెంబర్ ఒకటో తేదీన అనిమల్ లాంటి సినిమా, డిసెంబర్ లాస్ట్ లో సలార్ లాంటి సినిమాలు ఉంటే.. నాని చక్కగా ప్లాన్ చేసుకొని తెలివిగా మంచి ఐడియాతో కరెక్ట్ గా మధ్యలో రిలీజ్ అయ్యాడు. కానీ ఆ రెండు వైలెన్స్ సినిమాలకి కాకుండా నాని మధ్యలో సెంటిమెంటు, ఎమోషన్ ఉన్న సినిమాతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలాంటి సినిమాతో ఎంటర్ అయితే.. నితిన్ కూడా అప్పుడే ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నితిన్ సినిమా కూడా ఫ్యామిలీ రిలేటెడ్ సినిమా నే. ఒకవేళ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ రెండు సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అందరికీ.. నాని సినిమా గాని ఎక్కువగా నచ్చితే.. నితిన్ సినిమా ఇక కొనసాగడం కష్టమవుతుంది. లేదా రెండు సరి సమాన పోటీలో ఉంటే రెండు సమానంగా వెళ్తాయి. ఏదేమైనా నాని ఐడియాతో తెలివిగా ఒకలా వస్తే.. మరోపక్క ఈ పబ్లిక్ టాక్ఇ తో బ్బందుల్లో పడుతుంది. రేపు రిలీజ్ అవుతున్న నితిన్ సినిమా ఎలా ఎంతవరకు నెగ్గుకొస్తుందో చూడాలి మరి..