Home Cinema Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

Nandamuri Taraka Ratna ; నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

నందమూరి వంశం నుంచి వచ్చిన ప్రతి హీరోని, నందమూరి అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో, సినిమాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారకరత్నను కూడా అభిమానులు ఎంతగానో ఆదరించారు. అలాగే తారకరత్న కూడా ఆయనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గున్న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన నందమూరి అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.

See also  Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ తరవాత రవితేజానే.. నిజమేనంటారా?
Nandamuri Taraka Ratna
Taraka Ratna health condition

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ ఉండగా కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చివరకు డాక్టర్లు ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. ఆయనను నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు పరామర్శించి వచ్చారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే.

See also  Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?
nandamuri tarakarathna health updates
latest health condition about nandamuri tarakarathna

నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్ పై వైద్యులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆయనకు ఆక్సిజన్ సరిగ్గా అందక , బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయిందని తెలిపారు. అందుకని బ్రెయిన్ డ్యామేజ్ రికవరీ పై డాక్టర్స్ శ్రద్ద పెట్టి వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిమ్మదిగా మెరుగుపడుతుందని తెలిపారు. ఆసుపత్రిలో తారకరత్న ట్రీట్మెంట్ అవుతుండగా రిలీజ్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో ప్రస్తుతం నందమూరి తారకరత్నకు వైద్యం జరుగుతుంది.