Home Cinema Bhagavanth Kesari trailer review : భగవంత్ కేసరి ట్రైలర్ రివ్యూ.. పాపం శ్రీలీల..

Bhagavanth Kesari trailer review : భగవంత్ కేసరి ట్రైలర్ రివ్యూ.. పాపం శ్రీలీల..

nandamuri-balakrishna-and-sreeleela-movie-bhagavanth-kesari-trailer-review

Bhagavanth Kesari trailer review: నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల ముఖ్యపాత్రలో అనిల్ రావు పూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భగవంత్‌ కేసరి సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణకు శ్రీలీల ( Bhagavanth Kesari trailer review ) కూతురుగా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీలీల మధ్య ప్రతి సీను కూడా చాలా బాగుంటుందని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Bhagavanth-kesari-trailer

నువ్వు యాడున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడే దునియా నీకు బాంచన్ అంటది అని బాలకృష్ణ కూతురికి చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఈ డైలాగ్ తో ఈ సినిమా అజెండా ఏమిటో అర్థం అయిపోయింది. కూతుర్ని ఎలా పెంచాలని తండ్రి అనుకుంటున్నాడు తెలిసిపోయింది. బాలకృష్ణ శ్రీలీలని ఆర్మీలోకి పంపించాలని ( Bhagavanth Kesari trailer review ) అనుకుంటున్నాడని ట్రైలర్ లో చూపించారు. కానీ శ్రీలీలకి ఆర్మీలోకి వెళ్లడం ఇష్టం లేదని అర్థమవుతుంది. అసలు బాలకృష్ణ శ్రీలల ని ఆర్మీలోకి ఎందుకు పంపాలనుకుంటున్నాడు? ఆమెకి ఎందుకు ఇష్టం లేదు? చివరికి వెళ్తుందా లేదా అని ఒక క్యూరాసిటీని అయితే ట్రైలర్ లో క్రియేట్ చేశారు.

See also  Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

Bhagavanth-kesari-trailer-sreeleela

ఇక ఈ సినిమాలో శ్రీలీలకు చాలా ముఖ్యమైన పాత్రను ఇచ్చారన్న విషయం తెలుస్తుంది. సినిమాలో చాలావరకు భాగం ఆమె నటనతో నింపుతుందని అర్థమవుతుంది. గ్లామర్ రోల్ కి పరిమితం కాకుండా శ్రీలీల కి ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా అదృష్టమనే అనుకోవాలనిపిస్తుంది. అనిల్ రావు పూడి.. శ్రీలీలకు ఉన్న గ్లామర్ నీ, పేరుని ( Bhagavanth Kesari trailer review ) ఈ సినిమాలో చాలా బాగా వాడాడని అర్థమవుతుంది. నన్ను విడిచెయ్ అంటూ శ్రీలీల బాలకృష్ణ ను వేడుకోవడంతో సినిమాలో అసలు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ బిడ్డని స్ట్రాంగ్ చేయాలి షేర్ లెక్క అని చెప్పే డైలాగ్ తో అనిల్ రావు పూడి ఆడవాళ్ళ ఆదరణ పొందాలని డిసైడ్ అయ్యాడని అర్థమవుతుంది.

See also  Prabhas : ప్రభాస్ అంత రిస్క్ ఎవరి కోసం చేస్తున్నట్టు..

Bhagavanth-kesari-trailer-balakrishna

ఈ సినిమాకి లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండవచ్చని, లేడీ అభిమానులు విపరీతంగా రిపీట్ అయ్యే అవకాశం ఉండేలా చూసుకున్నాడని అర్థమవుతుంది. ఒక ఆడపిల్లని ఈ రోజుల్లో ఎలా పెంచాలి, వాళ్లకి ఎలాంటి ధైర్యాన్నివ్వాలి అనే కాన్సెప్ట్ ని పట్టుకొని సినిమా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగ్స్, ఫైట్స్, నటన అంతా ఎప్పటిలాగే ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. కాకపోతే విల్లన్ ఎంతవరకు ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అనే విషయం సినిమాలో మాత్రమే తెలియాలి. ఇక కాజల్ ని ట్రైలర్ లో పెద్దగా చూపించలేదు ఏదో ఒక డైలాగ్ కోసం మాత్రమే భగవంతు కేసరి పేరు చెప్పడానికి మాత్రమే చూపించారు. ఏదేమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నందమూరి అభిమానులకు ట్రైలర్ అయితే బాగానే సాటిస్ఫై చేసిందనే అనుకోవచ్చు.

See also  Chiranjeevi : ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ పవన్ ఇలా ఏ హీరోకి దక్కనిది చిరంజీవికి దక్కిందట!