Namrata: మనందరికీ తెలుసు.. సినీ ప్రపంచంలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని కలకాలం పిల్లాపాపలతో హాయిగా సంసారం చేసే జంటలు ఉన్నాయి. మరి కొందరు ఇలా వివాహం చేసుకొని అలా విడాకులు తీసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కానీ వివాహం చేసుకుని ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎలాంటి గొడవలు పడకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు– నమ్రతల (Namrata) జంట. 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.
ఆ చిత్రం సమయంలోనే వీళ్లిద్దరు ప్రేమలో పడిన తర్వాత.. ఇరు కుటుంబంలోని పెద్దలను ఒప్పించి 2005 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు నమ్రతలకు (Namrata) ఓ పాప, ఓ బాబు జన్మించారు. బాబు పేరు గౌతమ్ కృష్ణ.. పాప పేరు సితార.. వీరి వివాహానికి మొదట మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోనప్పటికీ.. ఇందిరా దేవి అతి కష్టం మీద కృష్ణను ఒప్పించి మరీ దగ్గరుండి మహేష్ బాబు నమ్రతల వివాహం జరిపించింది. వీరి వివాహం ఎలాంటి హంగామా చేయకుండా చాలా సింపుల్ గా చేసుకున్నారు.
ఇక వివాహం అనంతరం నమ్రత సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. మనందరికీ తెలుసు నమ్రత మహేష్ బాబు కంటే ముందే బాలీవుడ్లో ఓ పెద్ద హీరోయిన్ అని.. వివాహం అనంతరం సినిమాలో నటించకూడదని కండీషన్ తో భర్త మాట కాదనలేక సినిమాలకు దూరంగా ఉంటూ మహేష్ బాబు సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో అలాగే అన్ని ఇంటి పనులు ముందుండి చూసుకుంటుంది నమ్రత.. ఇదే కాకుండా నమ్రత మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా చాలా పేరుపొందింది. ఒకవైపు ఇంటి బాధ్యతలు చూస్తూనే మరొకవైపు బిజినెస్ ని చూసుకుంటూ తన చేతిలో రెండు బాధ్యతలను మోస్తుంది.
ఇక మన అసలు విషయానికొస్తే.. మొదట తన ప్రేమ విషయాన్ని మహేష్ బాబు కంటే ముందే ఆ స్టార్ హీరోకి చెప్పిందట నమ్రత.. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. నమ్రత కి వాస్తవ్ అనే సినిమా చేస్తున్న సమయంలో సంజయ్ దత్ మంచి స్నేహితుడయ్యారట.. ఇక సంజయ్ దత్ ప్రవర్తన ఓ చిన్నపిల్లాడిలా ఉంటుందంటూ ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో నమ్రత తెలిపింది. ఇక ఇదే కాకుండా మహేష్ బాబుని ప్రేమిస్తున్నాను అన్న విషయం మొదట చెప్పింది సంజయ్ దత్ కే అని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని వెల్లడించింది.