అక్కినేని నాగేశ్వర రావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆయన గురించి, ఆయన సాధించిన విజయాల గురించి తెలియనోళ్లు ఎవరూ లేరు. ప్రయోగాలకు నాగార్జున కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చేయని ప్రయోగం అంటూ ఏది లేదు. ఈ ప్రయోగం చేయడం వల్ల నా కెరీర్ రిస్క్ లో పడుతుంది, ఆమ్మో నేను చేయలేను అని ఆయన ఎప్పుడు అనుకోలేదు(Nagarjuna Sridevi). మనసుకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.
అవి సక్సెస్ అయ్యాయి, తనతో టాలీవుడ్ ని కూడా మరో మెట్టు ఎక్కించే అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసాడు. శివ, గీతాంజలి, అన్నమయ్య, హలో బ్రదర్, శ్రీ రామదాసు, నిన్నే పెళ్లాడతా, సంతోషం, మన్మధుడు ఇలా ఒక్కటా రెండా ఆయన చేసిన సూపర్ హిట్ సినిమాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క రోజు సరిపోదు. అలా ప్రయోగాత్మక చిత్రాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అలవోకగా చేసిన నాగార్జున కి ఒక హీరోయిన్ ని చూస్తే చాలా భయం వేసేది అట.
ఎందుకంటే శ్రీదేవి(Nagarjuna Sridevi) నాగేశ్వర రావు ఎన్టీఆర్ , కృష్ణ శోభన్ బాబు లాంటి మహానటులతో నటించిన హీరోయిన్. ఆమె అనుభవం ముందు నాగార్జున చాలా చిన్నవాడు. అలాంటి నాగార్జున కి కెరీర్ ప్రారంభం లోనే ఆఖరి పోరాటం వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు శ్రీదేవి ని చూసి నాగార్జున భయపడుతూ ఉండేవాడట. ఆమె ప్రతీ షాట్ ని సింగిల్ టేక్ లో చేసేది అట.
నాగార్జున అప్పుడే ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చిన హీరో, ఆ వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. అలాంటిడి శ్రీదేవి తో సినిమా అంటే ఎలా ఉంటుందో అని భయపడ్డాడు అట. అయితే షూటింగ్ ప్రారంభం లో ఆమెని చూస్తే చాలా భయం వేసిందని, కాలం గడిచే కొద్దీ ఆమె తనకి అలవాటు అయ్యిందని. అలా ఆమెతో చేసిన మొదటి సినిమాతోనే మంచి పరిచయం ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ‘గోవిందా గోవిందా’ అనే చిత్రం తెరకెక్కించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.