Actor In Tollywood: మన తెలుగు చిత్ర పరిశ్రమలో చలనచిత్ర రంగంలో ప్రస్తుతం సీనియర్ హీరోలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇక వీళ్ళు ప్రస్తుతం సీనియర్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీళ్లే కాకుండా మరెందరో ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి వీళ్లు మాత్రమే టాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న విషయం మనందరికీ తెలిసిందే.. సినిమా పరంగా వాళ్లు చేయని ప్రయోగమే లేదు. ఎన్నో వైవిధ్యమైన రకరకాల పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులకే కాక మరందరికో చేరువయ్యి వాళ్లందర్నీ అలరించిన ఈ నటులు..
బుల్లి తెరపై కూడా ఎన్నో రకాల షోలను నిర్వహించి మరదే విధంగా యాడ్లలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరి ఎంతో చేరువయ్యారు. కేవలం ఇదే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సహాయ మని అర్జించిన ప్రతి ఒక్కరికి మీ నేనున్నానంటూ ఎంతో మందికి సహాయం చేసిన మనసున్న మహారాజులుగా గుర్తింపు కూడా పొందారు. ఇక ఒకప్పుడు వీళ్ళు నటించే సినిమాలకు తీసుకునే పారిశోతకం లక్షలలో ఉండేది కానీ.. ప్రస్తుతం అది వందల కోట్ల చేరిపోయింది. ఇక ఇదే క్రమంలో ఆ సీనియర్ హీరోల పారిశోథకంతో పాటు వాళ్ళ ఆస్తులు కూడా భారీగానే పెరిగాయి. మరి టాలీవుడ్ లో అత్యధిక సంపన్నునిగా ఉన్న హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
బాలకృష్ణ: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసునిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈయన ఎన్నో సినిమాల్లో తన దైన శైలిలో నటిస్తూ.. సినిమా రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగులు పెట్టి రాజకీయ నేతగా కూడా ఇలా ఎన్నో రకాలుగా కూడబెట్టిన ఆయన ఆస్తి విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంటుందట.
చిరంజీవి: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతూ ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు. కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్నో వ్యాపారాలు కూడా చేస్తూ భారీ ఎత్తున తన సంపాదన కూడా పెట్టాడు. అటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగులు పెట్టి సుమారు 8 వేల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టినట్లు సమాచారం.
వెంకటేష్: స్వర్గీయ దగ్గుబాటి రామానాయుడు వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ కేవలం సినిమా రంగం ద్వారానే కాకుండా తన తండ్రి ఆస్తులతో కూడా భారీగానే కూడా పెట్టాడు. ప్రస్తుతం వీరి ఆస్తుల విలువ సుమారుగా 6 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. (Actor In Tollywood)
నాగార్జున: స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు వారసునిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున ముందు నుంచే తండ్రి ఆస్తులు ఉన్నప్పటికీ వాటిపై ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఎన్నో ఆస్తులను జమ చేశాడు. కేవలం సినిమా రంగం లోనే కాకుండా ఎన్నో రకాల బిజినెస్ చేస్తూ ఈయన కూడా భారీగానే సంపాదించాడు. వాళ్ల నాన్న సంపాదన అన్నపూర్ణ స్టూడియో తో కలుపుకొని మిగిలిన అన్ని బిజినెస్ లు అలాగే సినిమాల ద్వారా వచ్చిన సంపాదన మొత్తాన్ని కలుపగా నాగార్జున ఆస్తి ఇప్పటి వరకు కూడ పెట్టింది 13వేల కోట్ల రూపాయలని సమాచారం..