Nagababu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత గొప్ప స్థానం ఉందో మనందరికీ తెలిసిందే. మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆ స్థానం ఎవరివల్ల వచ్చిందో.. ఎవరి కృషి, పట్టుదలతో వచ్చిందో అందరికీ తెలుసు. అందుకే ( Nagababu comments on Surekha ) వాళ్లంతా ఆ స్థానం రప్పించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన గౌరవాన్ని, భక్తిని ఇచ్చి చూపిస్తారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళ ముగ్గురు తెలుగు సినిమా రంగానికి, సినీ అభిమానులకి అందరికీ తెలిసిన వాళ్లే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అన్నదమ్ములు గురించి ఎప్పటికప్పుడు మంచి మంచి వార్తలు వింటూనే ఉంటాం.
అయితే కుటుంబం అన్న తర్వాత ప్రతి కుటుంబంలోని ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కూడా భార్యల వల్లే వస్తాయి. మెగా కుటుంబంలో కూడా ముగ్గురు అన్నదమ్ములు.. చిరంజీవి పెళ్లయిన తర్వాత కూడా అందరూ కలిసే ఉండేవారట. ఆ తర్వాత ( Nagababu comments on Surekha ) ఒక్కొక్కరికి పెళ్లిళ్లు అయిన తర్వాత, ఎవరికి వాళ్లు విడిగా వెళ్లి బ్రతకడం మొదలు పెట్టారంట. అయితే అసలు మెగా కుటుంబంలో వీళ్ళ ముగ్గురికి ఎలాంటి గొడవలు వస్తాయి? వాళ్ళ భార్యల వల్ల ఏం జరుగుతాది అనే దానిమీద ఒకసారి నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పబ్లిక్ గా కుటుంబంలో ఉండే గొడవల గురించి, వాళ్ళ అన్న చిరంజీవి భార్య.. వాళ్ళ వదిన సురేఖ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది.
నాగబాబు కుటుంబంలో గొడవలు గురించి చెబుతూ.. మా అన్న మొదటి నుంచి మా అందర్నీ అన్ని రకాలుగా చూసుకొని వచ్చారు. ఆయనంటే మా అందరికీ గౌరవం. కానీ మా వదిన అంటే ఇంకా గౌరవం. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మా ముఖంలో ఆనందాన్ని చూడాలని, నవ్వుతూ ఉండాలని అని కోరుకుంటుంది. అందుకే ( Nagababu comments on Surekha ) నాకు ఏ సమస్య వచ్చినా మా అన్న కంటే ముందు మా వదిన దగ్గరకెళ్ళి అన్ని చెప్పుకుంటాను. అలాగే మా అన్నతో నాకు ఏమైనా గొడవ వచ్చినా కూడా.. మా వదిన అసలు ఊరుకోదు నెమ్మదిగా వెళ్లి మా అన్నకి సర్ది చెప్తాది లేదా ఆ సమస్య గురించి నాకే చెప్పాలనుకుంటే నాకే సర్ది చెబుతుంది. ఆమె చెబితే మేము అందరం వింటాం. ఎందుకంటే ఆమె అంటే అంత గౌరవం, ఆవిడ అంత మంచిది.
అలాగే ఇక ఆడవాళ్ళ మధ్య గొడవలు అనుకుంటే అసలు మా కుటుంబంలో ఆడవాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు అనేవి రావు. ఏం మాట్లాడుకున్నా మేము మేము మగవాళ్ళమే మాట్లాడుకుంటాం. అలా ఆడవాళ్ళ మధ్యన గొడవలు రాకుండా ఉండడానికి కూడా కారణం మా వదినే. మా వదిన అన్నిటికి సర్దుకుని పోతుంది. మా అన్నకు సంబంధించిన ప్రతి రిలేషన్ ని ఆవిడ కాపాడుకుని వస్తుంది. మా అన్న అయినా ఒక మాట అంటారేమో గాని.. మా వదిన ఒక మాట కూడా అనడు, అననివ్వదు. అలా మమ్మల్ని అందరినీ చూసుకుని వస్తుంది అని వాళ్ళ వదిన గురించి ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు నాగబాబు. నిజమే చిరంజీవి జీవితంలో అల్లు రామలింగయ్య లాంటి మంచి కుటుంబం నుంచి అడుగుపెట్టి.. వీళ్ళ కుటుంబంలో అందరినీ ఆమె మంచితనంతో అల్లుకుని పోయి.. పెద్ద కోడలుగా మరుదులు ఎప్పుడూ కూడా ఆమెని కొనియాడేలా ఆమె ప్రవర్తించడం.. నిజంగా అలాంటి స్త్రీ మూర్తి చిరంజీవి జీవితంలో రావడం వల్లే మెగా కుటుంబం అంత వెలుగు వెలిగిందేమో అనిపిస్తుంది.