Naga Chaitanya was the reason: అక్కినేని వారసత్వం పుచ్చుకొని ఆ తర్వాత అక్కినేని నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలోకి విక్రమ్ అనే సినిమాతో అడుగుపెట్టాడు. కానీ మొదటి చిత్రంతో బోల్తా కొట్టిన నాగార్జున ఆ తర్వాత తన సక్సెస్ కోసం మరింత పదును పెట్టి ఎన్నో సూపర్ హిట్ విజయాలను తన సొంతం చేసుకోవడమే కాక ఇండస్ట్రీలో ఎవరికి లేనని బిరుదులు ఆయన సొంతం చేసుకున్నాడు. లవ్ సినిమాలతో తీసి మన్మదుడుగా, యాక్షన్ సినిమాలతో కింగ్ గా, ఇవే కాకుండా నాగ్ ఇంకా యువ సామ్రాట్ వంటి పేర్లు అయన సొంతం చేసుకున్నాడు.
ఆయన అప్పట్లో నటించిన శివ, గీతాంజలి ఓ రేంజ్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించడంతో ఒక్కసారిగా ఆయనకు స్టార్ డం వచ్చి పడి పెద్ద హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ నాగార్జున ఆరు పదుల వయసున్నప్పటికీ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా, దీటుగా హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేస్తూ ఇండస్ట్రీకి ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకా అక్కినేని నాగార్జున ఇవేకాక తెలుగు సినిమా నటుడు, టెలివిజన్లో వ్యాఖ్యాత, నిర్మాత, వ్యాపారవేత్త.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించి 9 నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిలిం పేరు పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
అయితే నాగార్జున లైఫ్ స్టైల్ ఆయన సినీ జీవితం ఇంత బ్రహ్మాండంగా సాగుతున్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతగా బాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నాగార్జున మొదట పెళ్లి చేసుకునే దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె సహనాటి అయినటువంటి అమల ప్రేమలో పడి నాగేశ్వరరావుని ఎదిరించి మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున అమలకి అఖిల్ పుట్టాడు. కానీ అఖిల్ పుట్టిన తర్వాత కూడా నాగార్జునకి ఆడబిడ్డ కావాలని తన ఇంటికి మహాలక్ష్మి రావాలని కోరిక ఉండేదట.
కానీ అమల ఆ కోరిక తీర్చ లేదట.. ఎందుకంటే నాగార్జున ఎప్పుడు అయితే అమ్మాయి కావాలి అని అడిగాడో.. అప్పుడు అమల (Naga Chaitanya was the reason) మాట్లాడుతూ, ఎందుకండీ మనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అనడంతో నాగార్జున షాక్ అయ్యాడట. నాగార్జునతో అఖిల్ మాత్రమే నా కొడుకు కాదు నాగచైతన్య కూడా నా కొడుకే నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పడంతో నాగార్జున ఆడపిల్ల కావాలని కోరికను విరమించుకున్నారు అంట. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలిసి చాలామంది నెటిజన్స్ నాగచైతన్యాన్ని సొంత కొడుకులా అమల భావించడం వల్లే నాగార్జున మూడో బిడ్డని కనలేకపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.