Actor Varun Tej: మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలుగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కూడా.. ఇక మెగా ఫ్యామిలీకి తెలుగు సినిమా ప్రపంచంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు అలాగే గౌరవప్రదమైన స్థానం ఉంది. ఇక ఇలాంటి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి హీరోగా తనెంటో తన సత్తా చాటుకున్న తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తూ వచ్చారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ సాధించారు కానీ నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆ తర్వాత నిర్మాతగా పలు..
సీరియల్ లో కూడా కీలక పాత్రల్లో ఆయన అటు వెండి తెర పై అటు బుల్లి తెర పై కూడా పలు షో లలో నటిస్తూ కొన్నిటికి జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇంత పెద్ద మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని చూసాడట.. మరి అసలు నాగబాబు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణాలేంటి. అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.. సినిమాలలో అంతగా సక్సెస్ కానీ నాగబాబు నిర్మాతగా తన సత్తా చాటుకుందామని రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ అతి పెద్ద డిజాస్టర్ గా మూటగట్టుకుంది.
ఇక ఈ సినిమా కోసం నాగబాబు చేసిన అప్పుల వల్లే నాగ బాబు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఆ అప్పుల బాధ తట్టుకోలేకనే ఒకానొక సమయంలో నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ అప్పటికే ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియడంతో ఇంట్లో వాళ్ళందరూ తిట్టడంతో మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్నాడట. ఇక ఈ విషయాలన్నీ మొదటి నుండే చాలా దగ్గరగా చూస్తున్న వరుణ్ తేజ్ అసలు సినిమాలోకి రావద్దని గట్టిగా డిసైడ్ అయ్యి ఏదైనా జాబ్ చేసి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అలాగే నాగబాబుని ఇంట్లో వాళ్ళందరూ చూసి జాలి పడుతున్నట్లు తన ఆలోచనలను విరమించుకున్నాడట.
ఇదే కాకుండా నేను డిప్రెషన్ లోకి వెళ్తే నా కుటుంబం ఏమైపోతుందో అన్న ఉద్దేశంతో చివరికి కొన్ని సీరియల్లలో కూడా ముఖ్య పాత్రలో నటించి అలాగే జబర్దస్త్ షోలో కూడా జడ్జిగా చేరాడట. ఇలా వచ్చినా అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకుని సినిమాలలో కూడా కొన్ని ముఖ్యమైన పాత్రలో నటిస్తూ వచ్చారట.. ఇలా వచ్చిన సంపాదనతో మళ్ళీ నాగబాబు ఇండస్ట్రీలో నిలవగలిగాడట. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ముకుందా తో తన మొదటి చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చి తన హవా కొన సాధించుకొని ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో తాను ఒకరిగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తరువాత వరుణ్ (Actor Varun Tej) తనదైన నటనతో ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నాడు.