Smartphone: ఈరోజుల్లో ప్రతీ మనిషి జీవితం స్మార్ట్ ఫోన్ తో ముడిపడి ఉంది అనుకోవడం కంటే.. స్మార్ట్ ఫోన్ లోనే మనిషి జీవితం ఉందని అనుకునేలా పరిస్థితి నడుస్తుంది. నిద్రపోతున్న సమయం తప్ప, మిగిలిన టైం అంతా కూడా స్మార్ట్ ఫోన్ తోనే చాలామంది (More time smartphone using can get this big disease ) ఉంటున్నారు. కొందరు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ తోనే ఉంటున్నారు. అదెలా అంటారా? మ్యూజిక్ స్మార్ట్ ఫోన్ లో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని తెల్లవార్లు పడుకుంటారు. అసలు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తో ఉంటె ఏమౌతుందో చాలా మందికి తెలియదు.
అసలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది అనే దానిపైన కొందరు అధ్యయనం చేయగా అనేక విషయాలు బయట పడ్డాయి. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తరవాత కుటుంబసభ్యులు అందరూ కలిసి టీవీ చూడటం మానేశారు. అందరూ కలిసి ఏమిటి ఒంటరిగా కూడా చూసేవాళ్ళు తగ్గిపోయారు. దాని వలన ఒకరితో ఒకరికి అనుబంధాలు కూడా తగ్గాయి. కంప్యూటర్ గేమ్స్ పై కూడా మక్కువ ( More time smartphone using can get this big disease ) తగ్గింది. ఇటీవల చదువులు కూడా ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అవ్వడం వలన.. వాటికి కూడా పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు.
రోజుకి మూడు గంటలు కంటే ఎక్కువసేపు స్క్రీన్ వైపు అలానే చూస్తూ ఉంటె అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం అంట. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే ఏమౌతుందని బ్రెజిల్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఒక అనారోగ్యం బయట పడింది. అదేమిటంటే.. ” టీఎస్పీ ” అనగా థొరాసిక్ వెన్నెముక నొప్పి పై వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టారు. థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో (థొరాక్స్), ఎక్కువగా భుజం బ్లేడ్‌ల మధ్య ఉంటుంది, మెడ దిగువ నుంచి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది.
టీఎస్పీ అనే జబ్బు వచ్చిన వారికి ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్తారంట. కొన్ని సార్లు మూత్రాన్ని ఆపుకోవడం కూడా చాలా కష్టముగా ఉంటాదంట. అలాగే వెన్ను నొప్పి కూడా ఉంటాదట. దీని వలన నపుంసకత్వము కూడా వస్తుందట. యువత స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉండటం వలన తాత్కాలికంగా ఆనందం పొందుతారేమో గాని, జీవితంలో చాలా విలువైనవి కోల్పోతారు. అందుకే నిపుణులు చెప్పిన దానిని బట్టి స్మార్ట్ ఫోన్ ఊరికే ఎక్కువగా వాడకుండా, దానికి ఒక లిమిట్ పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.