
Miss Shetty Mr Polishetty: గత కొంతకాలంగా అనుష్క సినిమాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత అనుష్క మళ్లీ సినిమాతో మన ముందుకు వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ( Miss Shetty Mr Polishetty collection ) మొదటినుంచి కొంతవరకు నార్మల్ అంచనాలు ఉన్నప్పటికీ భారీ అంచనాలైతే ఎవరికీ లేవు. ఎందుకంటే ఈ సినిమా లో అనుష్క చిన్న హీరోమీ కాదు, తనకంటే చిన్న వాడితో కలసి నటించింది. అనుష్క చాలా కాలం తర్వాత సినిమాల్లో కనిపించడంతో ఆమె అభిమానులందరూ ఎంతో ఆనందపడ్డారు. సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్క విపరీతమైన లావు అయిపోయింది.
ఆ తర్వాత చేసే సినిమాలు నుంచి ఆమె చాలా ఏజ్డ్ పర్సన్ గా కనిపించేస్తుంది. లావు తగ్గడానికి ఆమె ఎంత ట్రై చేసినా కూడా కొంతవరకు తగ్గింది కానీ అయినా కూడా ఆమె అందం పోయింది. ఈ రకంగా అనుష్క కొంత కాలం నుంచి సినిమాలకు ( Miss Shetty Mr Polishetty collection ) దూరంగానే కనిపిస్తుంది. అనుష్క సినిమా చూడాలని ఆమె అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ప్రేమ, పెళ్లి నమ్మకం లేని ఒక అమ్మాయికి.. ప్రేమ, పెళ్లికి చాలా గౌరవించే ఒక అబ్బాయికి మధ్య జరిగే గొడవలతోపాటు.. పెళ్లికాకుండానే తల్లి కావాలని ఆతృత పడే ఆమె నిర్ణయానికి సంబంధించిన కథగా కనిపించింది.
అయితే ఈ కంటెంట్ లో ఎలాంటి వల్గారిటీ ఉంటుందో, ఇలాంటి సినిమాలో అనుష్క ఎందుకు నటించిందో అని ఎందరో అనుకోవడం జరిగింది. నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క శర్మ హీరోయిన్ గా, పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి.. అందరూ చాలావరకు పాజిటివ్ రివ్యూస్ రాశారు. సినిమా కంటెంట్ లో ఎలాంటి వల్గారిటీ లేదని.. కుటుంబ సభ్యులంతా ( Miss Shetty Mr Polishetty collection ) కలిసి ఆనందంగా చూడదగ్గ సినిమా అని.. సినిమాలో కామెడీ మరియు సెంటిమెంటుని కూడా చాలా బాగా పండించాడని రివ్యూస్ వచ్చాయి. యు. వి. క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఫెయిల్ అయినట్టు కాకుండా మంచి రిజల్ట్ ని రివ్యూ ద్వారా తీసుకుని వచ్చింది.
అయితే దురదృష్టం ఏమిటంటే.. సినిమా పేరు మంచి పేరు వచ్చినా కూడా కలెక్షన్లు విషయంలో అంతగా రాబట్టుకోలేకపోయింది. కారణం ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే జవాన్ సినిమా కూడా రిలీజ్ అయింది. పటాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ కనిపించిన సినిమా జవాన్. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. షారుక్ ఖాన్ సినిమా మంచి పాజిటివ్ టాక్ రావడంతో.. అనుష్క సినిమా పాజిటివ్ టాకు వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో నీరుగారిపోయింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్లను మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక మోస్తరుగా వచ్చినా.. ఓవర్సీస్ లో మంచి ఇన్కమ్ తీసుకొచ్చింది. మొత్తానికి అనుష్క సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా షారుఖ్ ఖాన్ మాత్రం కలెక్షన్స్ అన్ని లాగేసుకున్నాడు..