Minister KTR give warning to anchor in Balagam pre release event: కేటీఆర్ అంటే క్రమ శిక్షణ, క్రమశిక్షణ అంటే కేటీఆర్ అన్నట్టు ఉంటారు. ముఖ్యమంత్రి కొడుకు, మినిస్టర్ అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలలో ఆచరణలలో అన్నిటిలో ఒక విద్యావంతుడి సంస్కారం కనిపిస్తాది. ఇటీవల కేటీఆర్ గారు ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. అక్కడ ఆయన ఒక యాంకర్ కి గాట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. గట్టిగా వార్నింగ్ అంటే ఆమెని తిట్టేయడమో, కొట్టేయడమో కాదండో.. కేవలం కంటి చూపుతో, వేలి సైగతో ఆమెను అదమాయించారు. అది చూస్తే మన చిన్నప్పుడు, మనం బయట వాళ్ళ ఎదురుగా ఏదైనా తప్పు చేయబోతుంటే.. మన తల్లితండ్రులో, అన్నా అక్కనో ఎవరో ఒకరు మనకు సైగ చేసి కంట్రోల్ చేసే సీన్ చాలామందికి గుర్తుకు వస్తాది.
ఇంతకీ ఇదంతా ఏ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిందంటే.. కమెడియన్ వేణు మనందరికీ తెలుసు. పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన వేణు, ఇప్పుడు తొలిసారిగా దర్శకుడిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా పేరు బలగం కాగా ఇందులో ప్రియదర్శ్ హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించారు. దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక హీరో కమెడియన్ అవ్వడం, ఒక కమెడియన్ హీరో అవ్వడం చాలా కష్టం గాని, ఎందులో ఉన్నవారైనా దర్శకుడు అవ్వడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కమెడియన్ వేణు దర్శకుడిగా తన ట్యాలంట్ చూపించడానికి ముందుకు వచ్చాడు.
సాధారణంగా కొత్త దర్శకులు వారి తొలి సినిమా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్లలో ఉండే ఆలోచనలు, అనుభవాలు అన్ని మొదటి సినిమా పై పెట్టి తీస్తారు. ఆ తరవాత సినిమాలలో ఇంకా వాళ్ళు కొత్త స్టోరీ, కొత్త ఆలోచనలు మొదలు పెట్టాలి. అలానే ఇప్పుడు ఈ డైరెక్టర్ కూడా మొదటి సినిమా సక్సెస్ అవుతాడని అనుకుందాం. సినిమా పోస్టర్, ఆర్టిస్ట్ లను చూస్తే, ఎదో కొత్తదనాన్ని ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనా మన తెలుగు ఆడియన్స్ కి సినిమాలో సీన్స్ కనెక్ట్ అయితే చాలు, అది కొత్త కథ, పాత కథ అనే బేధం లేకుండా దేనినైనా సక్సెస్ చేస్తారు.
ఈ సినిమా ప్రీ పిలీజ్ ఫంక్షన్ కి మినిస్టర్ కేటీఆర్ ( Minister KTR give warning to anchor in Balagam pre release event ) వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ అనుదీప్ ని స్టేజ్ పైకి రమ్మని పిలిచారు. ఆయన పైకి వెళ్లి మాట్లాడటం మొదలు పెట్టారు. మరో గెస్ట్ హీరో సిద్దు వచ్చారు. అది చూసి, యాంకర్ అనుదీప్ దగ్గర మైక్ తీసుకుని సిద్దు వచ్చారని చెప్పింది. కేటీఆర్ వెంటనే ఆ మైక్ అనుదీప్ కి ఇమ్మని, కంటి చూపుతో వార్ణింగ్ ఇచ్చారు. అది అర్ధం చేసుకున్న యాంకర్ వెంటనే మైక్ అనుదీప్ కి ఇచ్చారు. ర్ సీన్ చూస్తే.. ఒకరిని చూసి, ఇంకొకరిని అవమానించడం గాని, అశ్రద్ధ చేయడం గాని, అవతలివాళ్ళు హార్ట్ అయ్యే అవకాశాన్ని వన్ పర్శంట్ కూడా ఇవ్వడం గాని కేటీఆర్ కి ఇష్టం ఉండదని అర్ధం అవుతుంది. ఇదంతా రికార్డు అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.