Game Changer : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా ఒక వెలుగు వెలుగుతున్న రామ్ చరణ్ సినిమా కెరీర్ పరంగానే కాకుండా.. ఈ ఏడాది తండ్రిగా ప్రమోట్ అయ్యి ఇంకా ఆనందంగా ఉన్నాడు. మరోపక్క రామ్ చరణ్ కు ( Game Changer digital business ) తన వ్యాపారాల్లో గాని, అవార్డుల రూపంలో గానీ అన్ని రకాలుగా కూడా మంచి శుభవార్తలతోనే ముందుకు సాగుతున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా కి దర్శకుడు శంకర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.
గేమ్ చేంజర్ సినిమాపై మెగా అభిమానులందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ సినిమా అంటే సాధారణంగా ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొని, కమర్షియల్ గా మరియు సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. కాకపోతే రోబో సినిమాతో ( Game Changer digital business ) టెక్నాలజీ వైపు తిరిగిపోయిన శంకర్ మళ్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా, కమర్షియల్ షిఫ్ట్ ఇచ్చే విధంగా సినిమాని తీస్తున్నాడు. పొలిటికల్ డ్రామా గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా శంకర్ లాంటి గొప్ప దర్శకుడు చేతిలో రూపుదిద్దుకోవడమే కాకుండా.. మరో తమిళ స్టార్ట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథను అందించడం విశేషం.
గేమ్ చేంజర్ ని దిల్ రాజు నిర్మిస్తుండగా, కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ కొట్టడానికి అన్ని సూచనలతో ముందుకు సాగుతుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఒక టీజర్ గాని, ట్రైలర్ గానీ ( Game Changer digital business ) ఏది కూడా రిలీజ్ కాలేదు. కేవలం టైటిల్, ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. అయినా కూడా ఒక అద్భుతమైన రికార్డుని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ బిజినెస్ అప్పుడే జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని .. జి స్టూడియోస్ సొంతం చేస్తుందంట. ఈ సినిమా రైట్స్ ని జి స్టూడియోస్ వాళ్ళు 275 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేశారంట.
అసలు సినిమాలో ఒక పాట గాని, ఒక టీజర్ గాని, ఒక ట్రైలర్ గానీ ఎటువంటివి ఇంకా రిలీజ్ కాకుండా.. కేవలం ఒక పోస్టర్ రిలీజ్ తోనే ఇంత పెద్ద బిజినెస్ జరగడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ కి అలాగే గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కి అంత క్రేజ్ ఉంది లేదని ఎవరు అనడం లేదు. ఆ క్రేజ్ వల్లే ఇంత పెద్ద బిజినెస్ జరిగిందన్న విషయం అర్థమవుతుంది. అయినా కూడా ఎంత క్రేజ్ ఉన్నా కూడా కేవలం ఒక పోస్టర్ రిలీజ్ తో ఇంత పెద్ద డిజిటల్ బిజినెస్ జరగడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. డిజిటల్ రైట్స్ 275 కోట్లకు పైగా కొనుగోలు చేసిందని తమిళ మీడియాలో కథనాల కింద వస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రామ్ చరణ్ ఒక పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నట్టే అర్థమవుతుంది.