Home Cinema Mega Family Italy : వామ్మో.. ఈ మెగా జంటలు ఇటలీలో వరుణ్ లావణ్యాలకు పోటీగా..

Mega Family Italy : వామ్మో.. ఈ మెగా జంటలు ఇటలీలో వరుణ్ లావణ్యాలకు పోటీగా..

mega-family-enjoying-in-italy-with-varun-tej-and-lavanya-tripathi

Mega Family Italy : సినిమాల్లో సరదాగా చూపించే పెళ్లి సందడే చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంటే.. ఇక రియల్ లైఫ్ లో సినిమా వాళ్ళు జీవితంలో జరిగే పెళ్లి వేడుక చూస్తుంటే అభిమానులకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో ( Mega Family enjoying in Italy ) మాటలతో చెప్పలేని అనుభూతి అది. మెగా కుటుంబంలో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఘడియలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంగా మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం అంతా కూడా తరలి ఇటలీకి వెళ్తున్నారు.

Mega-family-in-italy-varun-tej-marriage

మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ ఉపాసన అందరికంటే ముందే ఇటలీ చేరుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. క్లింకార కి అక్కడ వాతావరణం అంతా ముందు నుంచి అలవాటు చేయాలని ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ముందుగా ( Mega Family enjoying in Italy ) వెళ్లడం, అలాగే అక్కడ పెళ్లి పనులు చూసే బాధ్యతను కూడా నెత్తి మీద వేసుకొని వెళ్లారు. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడవ భారీతో కలిసి పెళ్లికి బయలుదేరిన సంగతి ఎయిర్పోర్టులో అందరికి కనబడింది. ఇక అల్లు అర్జున్, తన భార్య, కొడుకు, కూతురుతో కలిసి నిన్న ఆయన కూడా వేరే ఫ్లైట్లో బయలుదేరడం జరిగింది.

See also  Lavanya - Niharika : పెళ్లయిన కొద్దిరోజులకే నిహారిక పై సంచలన నిర్ణయం తీసుకున్న లావణ్య..

Mega-family-in-italy-varun-lavanya-marriage

ఇంచుమించుగా ఇటలీకి అందరూ చేరిపోయారు. రామ్ చరణ్ , ఉపాసన.. చిరంజీవి ,సురేఖ.. అల్లు అర్జున్ ,స్నేహ రెడ్డి.. ఇలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇలా అందరూ జంట జంటగా అక్కడకు చేరిపోయారు. కానీ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఒక రకమైన ఆనందంలో ఉంటే.. వాళ్లని మించేలా వీళ్ళు మాత్రం తెగ ( Mega Family enjoying in Italy ) ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరడం జరిగింది. ఇక చిన్న పెద్ద,వయసు తారతమ్యం లేకుండా అందరూ కలిసి చాలా వినోదంగా విందులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

See also  Arvind Swamy: ఇన్నేళ్లకు నా కొడుకే అని నోరిప్పడమే కాకుండా.. అరవింద్ స్వామి గురించి సంచలన సీక్రెట్స్ బయటపెట్టిన తండ్రి..

Mega-family-in-italy-varun-lavanya

ఇప్పటికే ఇటలీలో మంచి ప్లేస్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు వాళ్ళు మంచి ఫోజులిచ్చి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతుంటే.. వాళ్ళకి పోటీగా, ధీటుగా మిగిలిన మెగా జంటలు అన్నీ కూడా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ తన భార్యతో మంచి రొమాంటిక్ గా కూడా ఫోజులిస్తూ.. ఫోటోలు పెడుతున్నాడు. ఇక చిరంజీవి, సురేఖ అయితే చిన్న పిల్లల్లాగా వాళ్ళు కూడా చక్కగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇలా ఈ ఫోటోలను చూస్తేనే కడుపు నిండిపోతుంది.. ఇక పెళ్లి చూస్తే ఇంకా ఎలా ఉంటుందో అని అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకు మంచి హుషారిస్తూ.. ఈ మిగిలిన జంటలు మరింత రొమాంటికే గా.. బాగా ఎంజాయ్ చేస్తున్నాయని నెటిజనులు అంతా పొగుడుతున్నారు.