Malli Pelli Collections: సినిమా అంటేనే ఒక క్రేజ్ అని తెలుసు కానీ.. అదే సినిమా ప్రపంచంలో జరుగుతున్న ప్రస్తుత సంఘటనలు, హిస్టరీలో జరిగిపోయిన అనేక విషయాలని, భవిష్యత్తులో జరగబోయే మార్పులని, అన్నిటిని, అంతటి నాలెడ్జ్ ని కేవలం రెండున్నర గంటల్లో ప్రేక్షకుడికి ఇచ్చే గొప్ప సోర్స్ సినిమా. అటువంటి ( Malli Pelli Collections details ) సినిమాని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సమాజంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే మన టాలీవుడ్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెంటనే ఆ సీన్ ఒక సినిమాగా తీసేస్తాడు. బహుశా నరేష్.. రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ అయ్యి ఉంటాడు. అయినా కూడా ఆయన ఫాలో అయ్యే ట్రెండ్ కి నరేష్ కి చాల తేడా ఉందనుకోండి.
నరేష్ ఇటీవల తీసిన మళ్లీ పెళ్లి సినిమా కూడా ఒక యదార్ధ సంఘటనతో సినిమా తీయాలని.. పైగా తన జీవితంలో జరిగిన విషయాలనే తీయాలని.. తాను పవిత్ర లోకేష్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ప్రజలకు చాలా పాజిటివ్గా చెప్పాలని.. అన్నిటికీ కలిపి సినిమాను తీసి ప్రజల మీదకు వదిలాడు. సోషల్ మీడియాలో ( Malli Pelli Collections details ) ఆయనపై, పవిత్ర లోకేష్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ని ఆయన పాజిటివ్గా చేసుకోవడం కోసం.. పైగా ఆ నెగటివ్ కామెంట్స్ తో అంతగా ప్రమోషన్ అయిపోయిన ఆ కంటెంట్ ని సినిమా తీస్తే.. సినిమా పరంగా కూడా లాభం వస్తుంది అని ఆలోచించి.. ఆయన తీసిన సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈ సినిమాపై మొదటి రోజు పాజిటివ్ గానే చాలామంది రివ్యూలు రాశారు. కానీ నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే.. పాజిటివ్ రివ్యూలు రాయడం వలన లేదా సోషల్ మీడియాలో ముందు నుంచి ఆ కంటెంట్ మీద ప్రమోషన్ జరగడం వలన సినిమా ఆడదు. సినిమా ఆడాలంటే.. సినిమాలో ఒక మంచి సబ్జెక్టు ఉండాలి.. జనాలకి కనెక్ట్ అవ్వాలి. అసలు నరేష్ ( Malli Pelli Collections details ) ముగ్గురు పెళ్ళాలని వదిలేసి నాలుగో ఆవిడ పవిత్రని ఎందుకు పట్టుకున్నాడో తెలుసుకోవాలని మొదటి రోజు కొంతమంది అయినా సినిమాకెళ్లారు. ఆ సినిమాలో అది చెప్పలేదు సరి కదా.. ఏం చెప్పాడో, ఎందుకు తీసాడో అది నరేష్ కే తెలియాలి. దీనితో సినిమాకి వెళ్లే జనం తగ్గారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేటప్పుడు నరేష్ ఈ సినిమాకి 16 కోట్లు బడ్జెట్ అయిందని చెప్పాడు. దాన్నిబట్టి ఇప్పుడు కలెక్షన్స్ ఎన్ని అయ్యాయో తెలుసుకుందాం. ఈ సినిమాకి మొదటి రోజు 40 లక్షలు వసూలు కాగా, రెండవ రోజు 15 లక్షలు, మూడవరోజు 12 లక్షలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం కలిపితే 67 లక్షల అయింది. సినిమా బడ్జెట్ చూస్తే 16 కోట్లని నరేష్ నోటి తోనే చెప్పాడు. అంటే 15 కోట్ల వరకు నరేష్ నష్టపోయినట్టే.. పోనీ ఇంకెన్ని రోజులు ఈ సినిమా ధియేటర్లో ఉంచుకుంటారు? ఇంకా ఎంత కలెక్ట్ అవుతుందో?చూసినా కూడా మొత్తం అంతా కలిపి ఒక కోటి వరకు రాబట్టడం అంటే చాలా కష్టమని అర్థమవుతుంది. దీన్ని బట్టి నరేష్ పక్కాగా 15 కోట్లు నష్టపోయాడని అర్థమవుతుంది. ఇక్కడ నరేష్ నష్టపోయింది కేవలం కోట్లు డబ్బు మాత్రమే కాదు.. కోట్లకు కోట్లకు విలువచేసే అతను చేసిన పని మీద ఆడియన్స్ కు కలిగిన అభిప్రాయం కూడా రిజల్ట్ ఇక్కడే తెలుస్తుంది..