Home Cinema Mahesh – Trivikram: మహేష్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ సీక్రెట్ రివీల్.

Mahesh – Trivikram: మహేష్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ సీక్రెట్ రివీల్.

హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి మనందరికీ తెలిసినదే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా అతడు.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనదరకి తెలుసు. ఆ సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ని కూడా ప్రేక్షకులు చాలా శ్రద్దగా చూసారు. ఇందులో త్రివిక్రమ్ మహేష్ బాబు ని ఒక కొత్త కోణంలో చూపించారు.

See also  Pavitra Lokesh: మామూలుగా లేదుగా యవ్వారం - ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్..

రెండవ సినిమా ఖలేజ.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టలేకపోయినా, సినిమాకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇందులో మహేష్ బాబు యాక్షన్, త్రివిక్రమ్ డైలాగ్స్ రెండు చాలా బాగుంటాయి. దానికి తోడు సినిమాలో కమెడియన్ పై ఆధారపడకుండా.. హీరో హీరోయిన్ తోనే కామెడీ ని బాగా పండించాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమా అభిమానుల ఆశలను మాత్రం కొంచెం నిరాశపరిచింది.

సాధారణంగా ఏ హీరో ఫ్యాన్స్ అయినా, వాళ్ళ హీరోకి కొంతమంది డైరెక్టర్స్ తో సినిమా వస్తే బాగున్ను అనుకుంటారు. ఆ లిస్ట్ లో త్రివిక్రమ్ తప్పకుండా ఉంటారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ ఇప్పుడు మరొక సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకి ఒక విలాసవంతమైన ఇల్లు కావాలంట. అందులోనే ఎక్కువ షూటింగ్ చెయ్యాల్సి ఉంటుందంట.

See also  Suma : సుమ చావు భయంతో వాళ్లకు ఆ సీక్రెట్ చెప్పేసిందా?

హైదరాబాద్ లో పరిసల ప్రాంతాల్లో 10 కోట్ల బడ్జెట్ లో ఒక సూపర్ డూపర్ ఇల్లు సెట్ వేస్తున్నారంట. ఇందులోనే సినిమాలో చాలా వరకు సన్నివేశాలు చిత్రీకరిస్తారంట. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటాడంట. మరి ఇంత పెద్ద బడ్జెట్ తో చిత్రీకరించే ఆ ఇల్లు ఎలా ఉంటాడో సినిమాలో చూడాలి.