Home Cinema Rajamouli : మహేష్ రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ వచ్చేసింది..

Rajamouli : మహేష్ రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ వచ్చేసింది..

mahesh-babu-rajamouli-movie-first-look-update-is-here

Rajamouli : అభిమానులతో పాటుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహేష్ – రాజమౌళి కాంబినేషన్ పై రోజుకో గాసిప్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. మరోపక్క ఆ మూవీ టీం నుండి చప్పుడు లేకపోవడం తో అసలు వీళ్ళ కాంబినేషన్ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా తలెత్తాయి. కానీ సైలెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. ప్రతీ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీ లో రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మహేష్ బాబు చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఈ సినిమా(Rajamouli Mahesh Babu Movie) కోసం ఆయన వర్కౌట్స్ చేయడమే కాకుండా, లుక్స్ మొత్తం పూర్తిగా మార్చేశాడు కూడా. మహేష్ ని ఇలాంటి యాంగిల్ లో కలలో కూడా చూడలేము ఏమో అని అభిమానులు అంతకు ముందు అనుకునేవారు. వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేసాడు రాజమౌళి. గుబురు గెడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ బాబు అభిమానులకు కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేసాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 9 న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు భావించారు.

See also  Tapsee : ఆ పెళ్లైన హీరోతో తన రిలేషన్ గురించి రివీల్ చేసిన ప్యాన్ ఇండియా హీరోయిన్.

కానీ రాజమౌళి నుండి మహేష్ బాబుకు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అందలేదు. దీనిపై సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. అసలు ఇంత గోప్యతగా వ్యవహరించడం ఎందుకు? ఒక్క అధికారిక ప్రకటన చేయడానికి మూవీ టీం ఎందుకు ఇంత సీక్రెట్ మైంటైన్ చేస్తుంది అని అభిమానులు తలలు బాదుకుంటున్నారు. కేవలం ఈ సినిమా వర్క్ షాప్ కోసం మహేష్ ఏడాది సమయం వృధా చేయడం కంటే, ఒక సినిమా(Rajamouli Mahesh Babu Movie) కూడా చేసేది ఉండొచ్చు కదా అని అభిమానుల ఆవేదన.

See also  NTR: అప్పుడే లీకైన NTR30 స్టన్నింగ్ అప్డేట్.. మొదటి యాక్షన్ సీన్ ఇదే..

అయితే రాజమౌళి 1500 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాపై ఆ మాత్రం సస్పెన్స్ మైంటైన్ చేయకపోతే ఎలా?, ఆలస్యంగా వచ్చినా ఇండస్ట్రీ ని షేక్ చేసే విధమైన ప్రకటనతోనే మన ముందుకు వస్తాడు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి. అదే రోజున సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారని టాక్, మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.