Home Cinema Mahesh Babu: ధనుష్ లో ఆ కోణాన్ని పొగిడిన మహేష్ బాబు..

Mahesh Babu: ధనుష్ లో ఆ కోణాన్ని పొగిడిన మహేష్ బాబు..

Mahesh Babu comments about Dhanush movie Raayan

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఆ సినిమా ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలో ( Mahesh Babu comments about Dhanush movie Raayan ) మహేష్ బాబు నటన, స్టైల్, లుక్ అన్నీ కూడా అదిరిపోయాయని ఆనందంలో ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూసి వాటి గురించి తన కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది.

See also  Rashmika : విజయ్ దేవరకొండ తల్లి పై రష్మిక చేసిన కామెంట్ తో అసలు నిజం బయటపడిపోయింది..

Mahesh Babu comments about Dhanush movie Raayan

జూలై 26వ తేదీన ధనుష్ హీరోగా నటించిన సినిమా రాయన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో స్పెషల్ ఉన్నాయి. ఈ సినిమాకి హీరో ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా ( Mahesh Babu comments about Dhanush movie Raayan ) దర్శకుడుగా కూడా మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఈ సినిమా ధనుష్ కెరీర్ లో 50 వ సినిమా కూడా. నేషనల్ అవార్డు సాధించిన ధనుష్ ఎలా నటిస్తాడో అన్ని భాషల వారికి తెలుసు. అన్ని భాషల వారిని ఆకట్టుకున్న హీరో అతను. అయితే ఇప్పుడు దర్శకత్వం ఎలా చేస్తాడో అని అందరిలో ఒక రకమైన ఆసక్తి ఉండేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కూడా బాగానే చేశాడనే టాక్ వచ్చింది.

See also  Anchor Vishnu Priya : ఆ హీరోతో.. శోభనం ఎంత ఇష్టమో విష్ణుప్రియ వివరించిన వీడియో వైరల్!

Mahesh Babu comments about Dhanush movie Raayan

ఈ సినిమాలో ధనుష్ కి తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం నటించారు. చెల్లెలి పాత్రలో దూషారా విజయన్ నటించారు. అయితే ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాయన్ సినిమా చూసాను.. ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా ఎంతో అద్భుతంగా ( Mahesh Babu comments about Dhanush movie Raayan ) దశకత్వం కూడా వహించారు అంటూ ధనుష్ లో దర్శక కోణాన్ని ఎంతగానో పొగిడారు. ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ మిగతా నటులందరూ కూడా ఎంతో బాగా అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ చేశారు. ఏఆర్ రెహమాన్ మంచి స్కోర్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమాని చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ చిత్రం టీమ్ అందరికీ కూడా కంగ్రాట్స్ అని మహేష్ బాబు పోస్ట్ చేయడం జరిగింది. ధనుష్ లో ఒక హీరో కోణాన్ని మాత్రమే కాకుండా.. దర్శకత్వ కోణాన్ని కూడా చూసి.. ఎంతో అద్భుతంగా ఆ కోణం కూడా ఉందని మహేష్ బాబు చెప్పడం జరిగింది.