Mahesh – Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య ఎంతో అన్యోన్యమైన జంటని మనందరికీ తెలుసు. మహేష్ బాబు నమ్రత ఒకరినొకరు ప్రేమించుకుని.. పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోకపోతే.. కొన్నాళ్లు వెయిట్ చేసి, వాళ్ళని ఒప్పించి.. ఆ తర్వాత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ ( Mahesh and Namrata attend Shriya ) తెలిసిందే. మహేష్ బాబు నమ్రతలకి ఒక కొడుకు, కూతురు కలిగి ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటారో ఉండరో అనే భయాన్ని పోగొట్టడానికి ఈ జంట కూడా ఒక మంచి ఉదాహరణ. మహేష్ బాబు, నమ్రత గురించి ఎప్పుడూ కూడా చాలా మంచి వార్తలే వస్తూ ఉంటాయి. మహేష్ బాబు కేవలం తాను సంపాదించిందంతా నమ్రతా చేతుల్లోనే పెడతాడని..
ఆమె మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటుందని అంటారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమై.. తన కెరియర్ ని కూడా మహేష్ కెరియర్ లోనే చూసుకుంటూ.. తన భర్త సినిమాలు గురించి స్టడీ చేస్తూ.. వచ్చిన ఆదాయాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కుటుంబంలో, ఎవరిని ఎలా చూడాలో, మహేష్ ( Mahesh and Namrata attend Shriya ) కుటుంబం వాళ్ల సంబంధించిన వాళ్ళకి ఎలా చూడాలో, వచ్చిన దాన్ని ఎలా ఎక్కువ ఇంకా పెంచుకోవాలో, మొత్తం బిజినెస్ ప్లాన్లు అన్నీ కూడా నమ్రతానే చూసుకుంటుందని ఎన్నోసార్లు వార్తలు రావడం జరిగింది. వీటన్నిటిలో ఎన్ని నిజాలు ఉన్నా లేకపోయినా.. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం నిజంగా ఆనందదాయకం.
ఇటీవల మహేష్ బాబు నమ్రత కలిసి శ్రేయ భూపాల్ బేబీ షవర్ ఫంక్షన్ కి వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంతకీ శ్రేయ భూపాల్ అంటే ఎవరు? మీకు గుర్తే ఉండి ఉంటుంది. శ్రేయ భూపాల్, అఖిల్ ప్రేమించుకుని వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ తర్వాత వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. దానికి కారణం శ్రేయ భూపాల్ కి చాలా ( Mahesh and Namrata attend Shriya ) పొగరని అఖిల్ అందుకే వద్దనుకున్నాడని కొందరంటే.. కొందరు అఖిల్ సరైనోడు కాదని.. బాధ్యత లేని వాడని , శ్రేయ తన వల్ల దేనికో హర్ట్ అయిందని, అందుకే ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని మరికొందరంటే.. అఖిల్ సినిమా కెరియర్లో పెద్దగా సక్సెస్ అయ్యే వాడిలా కనిపించలేదని సక్సెస్ నేను చోట అనవసరం అని వదిలేసిందని మరికొందరు. అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సల అవ్వడం గురించి మాట్లాడుకోవడం జరిగింది.
నిజానికి అందరివి ఊహలు మాత్రమే ఉంటాయి. ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ తెలుస్తాది. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే.. అఖిల్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న శ్రేయ భూపాల్ అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్.. ఆ బిడ్డ షవర్ బాత్ ఫంక్షన్ చేసుకుంది. దానికి మహేష్ బాబు,నమ్రతా కూడా వెళ్లారు. వెళ్లి అక్కడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సెలబ్రిటీస్ లా వెళ్లి.. మౌనంగా నుంచొని.. మౌనంగా వచ్చేయకుండా.. సరదాగా అందరితో మింగిల్ అయిపోయి.. మహేష్, నమ్రత చాలా ఎంజాయ్ చేశారు. అలా ఎంజాయ్ చేయడమే కాకుండా.. సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ.. మహేష్ బాబు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనితో మహేష్ అభిమానులందరూ ఆ ఇమేజెస్ ని వైరల్ చేస్తూ ఉన్నారు. మా హీరో ఎంత సామాన్యంగా, ఎంత బాగా అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ మరి షేర్ చేస్తున్నారు.