Madhavi Latha: నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో మంచి స్పీడ్ మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా వరుస ఫ్లాప్స్ తో హిట్ తగలక నడుస్తున్న బాలకృష్ణ కెరీర్లో.. లాస్ట్ వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ సాధించాడు. బాలకృష్ణ ఈ వయసులో కూడా యూత్ హీరోలని సైతం జడిపించేలా ( Madhavi Latha comments on Balakrishna ) పోటీ పడుతూ.. తనదైన శైలిలో నటిస్తూ.. సక్సెస్ అందుకోవడం.. సినిమా తీసిన వాళ్ళకి లాభాలు చేకూర్చడం అంటే.. అది మామూలు విషయం కాదు. బాలకృష్ణ వరస సినిమాల హిట్స్ తో దూసుకుపోతుంటే.. నందమూరి అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.
జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా ఇటీవల రిలీజ్ అయిన భగవంత్ కేసరి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత నెమ్మదిగా సక్సెస్ దారిలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ( Madhavi Latha comments on Balakrishna ) ఈ సినిమా రిలీజ్ టైం లో రిలీజ్ అయిన ఇతర రెండు సినిమాలు కూడా లియో, టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోవడం వలన ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయింది. లియో సినిమా అటు ఇటుగా టాక్ తెచ్చుకుంటూ అది కూడా ఏదో రకంగా నడిచేసింది. ఇక టైగర్ నాగేశ్వరరావు అయితే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీనితో పండగ సమయంలో కుటుంబం మొత్తం చూసే సినిమా అంటే భగవంత్ కేసరి సినిమా కనిపించింది.
ఎప్పుడు ఫ్రాక్షన్ సినిమాలతో పెద్ద పెద్ద డైలాగ్స్ తో గంభీరంగా ఉండే బాలకృష్ణ.. భగవంత్ కేసరి సినిమాలో తండ్రి పాత్రలో చక్కగా సౌమ్యంగా.. బాలకృష్ణ లో కూడా ఇలాంటి నటుడు ఉన్నాడు అని అర్థమయ్యేలా తీసాడా సినిమా ( Madhavi Latha comments on Balakrishna ) దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే భగవంత్ కేసరి సినిమాపై హీరోయిన్ మాధవి లత కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ మాధవి లత గతంలో స్నేహితుడా, నచ్చావులే సినిమాల్లో హీరోయిన్గా నటించినది. కానీ ఆమె సక్సెస్ కాలేకపోయింది. దానితో పొలిటికల్ లైన్ లోకి వెళ్లి.. బిజెపిలో ఉంటూ ఎమ్మెల్యేగా ట్రై చేసి పోటీ చేసింది కానీ గెలవలేకపోయింది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి లో గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ అనే దాని గురించి ఆయన చెప్పడం చాలా బాగుందని చెప్పింది.
స్టార్ హీరోలు కేవలం సినిమాల్లో ఫైట్స్, డాన్స్ మాత్రమే చేయకుండా.. ఇలాంటి మంచి విషయాలను చెప్పడం నిజంగా మంచి విషయమని పొగిడింది. అలాగే ఈ సినిమాలో శ్రీలీల చాలా బాగా నటించిందని విన్నానని చాలా బాగా చేసిందని పొగిడింది. అయితే సినిమాలో డైలాగులు చెప్పడం మాత్రమే కాదు.. ఆ డైలాగులు చెప్పినవి రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే బాగుంటుంది అని కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కౌంటర్ ఎవరికీ ఇచ్చింది? డైలాగులు బాలకృష్ణ చెప్పినవి బాగున్నాయని పొగిడింది ఒకపక్క.. మరోపక్క డైలాగులు రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే బాగుంటుందని అన్నది. అయితే బాలకృష్ణనే విమర్శించిందని కొందరు అంటుంటే లేదు మామూలుగా చెప్పి ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మాధవి లత మాటలకు అర్దం ఏమిటో ఆమె చెప్పాలి మరి..