Leo movie First Day Collection : కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ అంటే కేవలం కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. అన్ని భాషల వారికి విజయ అంటే చాలా ఇష్టం. తన నటన, తన డాన్స్, ఫైట్స్ అన్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. విజయ్ సినిమాలను తెలుగువారు ( Leo First Day Collection ) ఎక్కువగా రీమేక్ చేసుకుంటారు. అలాగే తెలుగు సినిమాల్లో కూడా ఏమైనా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వాటితో విజయ్ రీమేక్ లో ఎక్కువగా నటిస్తుంటాడు. ఇలా విజయ్ కి తెలుగు ఆడియోస్ కి ఎంతో మంచి సంబంధం ఉంది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయింది. దానితోపాటు విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, కోలీవుడ్ ట్యాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్( Leo First Day Collection ) దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీశారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులకు మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ , విజయ్ కాంబినేషన్ మంచి కాంబినేషన్.
అంతేకాకుండా ఈ దర్శకుడు గత ఏడాది కమల్ హాసన్ తో తీసిన విక్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఈ దర్శకుడు తో విజయ్ ఇంతకుముందు మాస్టర్ సినిమా నటించగా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా నటించాడు. లియో సినిమాపై ఇన్ని భారీ అంచనాలు ఉండడం వలన ఈ సినిమాకి రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 100 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో లియో ప్రీ సేల్స్ భారీ ఎత్తున జరిగాయి. సినిమాపై ముందుగానే అంచనాల ఎక్కువగా ఉండటం వలన టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవడం వలన మొదటి రోజులోనే 15 నుంచి 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఇప్పటికే 8 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చినట్టు తెలుస్తుంది.
మొదటి రోజు ఇలాంటి కలెక్షన్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎనిమిది నుంచి పది కోట్ల రేంజ్ లో షేర్ రాబోతుంది అన్న విషయం అర్థమవుతూనే ఉంది. ఇది లోకేష్ కనకరాజు మరియు విజయ్ కెరీర్ లోనే చాలా టాప్ అని అందరూ అంటున్నారు. రీసెంట్గా వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో కూడా ఫస్ట్ డే ఇంత వసూలు రాబట్టిన రికార్డు ( Leo First Day Collection ) లియో హైప్ సృష్టిస్తాదని అంటున్నారు. ఇక దసరా బరిలో లియో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు,లియో ఇలా మూడు సినిమాలు పోటీపడుతున్నప్పటికీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు, యూత్, ప్రత్యేకంగా ఒక హీరో ఫ్యాన్ కాకుండా కామన్ ఆడియన్స్ అందరూ కూడా లియో సినిమా పై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.