Lavanya Tripati-Varun Tej: అందాల రాక్షసి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఆమె తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అప్పట్లో చాలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో హిట్స్ పొందలేక కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే మంచి హీరోయిన్గా పేరు నిలుపుకున్న లావణ్య త్రిపాఠి పెద్ద హీరోలతో జంటగా నటించే అవకాశాన్ని మాత్రం దక్కించుకోలేక పోయింది.
అయితే ఆమె కెరియర్లో విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది కానీ ప్రస్తుతం ఆఫర్ల కొరకు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ చేస్తూ అప్పుడప్పుడు వైరల్ గా మారి వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానున్న మేకపులి అనే వెబ్ సిరిస్ చేస్తూ మన ముందుకు రాబోతుంది లావణ్య త్రిపాఠి. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా లావణ్య త్రిపాఠి తెగ పాల్గొంటుంది. ఐతే.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి చేసిన మిస్టర్, అంతరిక్షం సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ వీరి కెమిస్ట్రీ మాత్రం సూపర్ అనే టాక్ వచ్చింది.
అదే కాక వీరిద్దరూ ప్రైవేట్ గా కూడా పలు పార్టీల్లో కలుసుకోవడంతో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలు (Lavanya Tripati-Varun Tej) ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వ్యాపించాయి. దీనిపై స్పందించిన నాగబాబు, లావణ్య త్రిపాఠి అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చిన రీసెంట్గా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ మరొకసారి ఆ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందా లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే మేక పులి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ షోలో మాట్లాడుతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.
ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడగ్గా వరుణ్ తేజ్ అని లావణ్య సమాధానం చెప్పింది. ఇదేకాక వరుణ్ తేజ్ గురించి మాట్లాడిన ప్రతి మాటలు ఆమె ముఖంపై సిగ్గుతో మొగ్గలేసింది, ఆమె ముఖంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబారింది. దీంతో వరుణ్ తేజ్ పై లావణ్యకు ప్రత్యేక అభిమానం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారుగా..