
Lavanya Tripathi : ఇటీవల కాలంలో మెగా కుటుంబంలో ఎంతో వైభవంగా జరిగిన వేడుక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి. ఈ పెళ్లిని నిజంగా మెగా అభిమానులందరూ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగానే ఊహించుకుంటూ చూశారు. అంత ఆనందాన్ని మెగా కుటుంబం కూడా వాళ్ళ అభిమానులకి అందించింది. ఎప్పటికప్పుడు ( Lavanya Tripathi first post after marriage ) ఆ పెళ్లి వార్తలని ఫోటోలు చూస్తూ అభిమానులు ఎంతో ఆనందించారు. మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించి.. వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టి అక్కడ నుంచి ఈరోజు పెళ్లి వరకు సక్సెస్ఫుల్గా తీసుకొని వచ్చారు.
గత ఆరు ఏడు సంవత్సరాలుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకరినొకరు ఘాఢంగా ప్రేమించుకుంటూ.. ఆ వార్తను ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ చివరికి పెళ్లి చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి.. వీళ్ళ రిసెప్షన్ వరకు ( Lavanya Tripathi first post after marriage ) కూడా ప్రతి చిన్న చిన్న వేడుకలను కూడా ఎంతో మనస్పూర్తిగా, ఆనందంగా చేసుకున్నారు. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలోని ఉన్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు. వాళ్ళ ఫోటోలను ఎవరెవరో షేర్ చేయాలి తప్ప లావణ్య త్రిపాఠి అంత హుషారుగా లేదు. ఇప్పుడు లావణ్య త్రిపాటికి కొంత తీరిక దొరికింది అని నెటిజనులు అనుకుంటున్నారు.
ఎందుకంటే.. లావణ్య త్రిపాఠి.. పెళ్లి, రిసెప్షను అన్నీ అయ్యి.. ఆమె ఆడపడుచు నిహారిక సినిమా ఓపెనింగ్ పూజ కూడా అయ్యి.. అన్ని జరిగిన తర్వాత ఆమె నిదానంగా తన సోషల్ మీడియా వైపు ఒక్కసారి తొంగి చూసింది. కొత్త పెళ్లికూతురు ఏం చెప్తుందా పెళ్లి తర్వాత అని అందరూ ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ( Lavanya Tripathi first post after marriage ) సామాన్యులు ఇళ్లల్లో కూడా పెళ్లైన జంటలో పెళ్లి తర్వాత కొత్త పెళ్లికూతురు ఏం చెప్తుంది అనే ఆసక్తిగా ఎదురు చూస్తారు. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టి, తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టి, ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె అనుభవం ఎలా ఉంది? ఆమె ఆనందం ఎలా ఉంది అని అందరూ తెలుసుకుంటారు . అలాగే లావణ్య త్రిపాఠి కూడా మొదటిసారి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెళ్లి తర్వాత మొట్టమొదటి పోస్ట్ పెట్టిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. నిజంగా మెగా అభిమానులందరికీ ఆనందాన్ని కలిగింపజేసింది. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలు కొన్ని ముఖ్యమైనవి పెట్టి.. దాని కింద తన మనసులో ఉన్న మాట పెట్టింది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి.. ” నా భర్త జాలి, కేరింగ్ ఉన్న ఎంతో మంచి మనిషి. ఇంకా తన గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ.. వాటన్నిటిని నా మనసులోనే దాచేసుకుంటున్నాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది. ఓ కలలా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి, బెస్ట్ విషెస్ ఇచ్చిన ప్రతి వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటున్నాను.” అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. వాళ్ళ హీరోని పొగిడిన వాళ్ళ వదినమ్మ ని ఇంకా పొగుడుతున్నారు. ఏదేమైనా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇలాగే కలకాలం ఆనందంగా కలిసి ఉంటూ.. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండాలని అభిమానులు అందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.