Home Cinema Lakshmi Parvathi:సీనియర్ ఎన్టీఆర్ మరణం కోసం వాళ్ళు ఎం చేశారో చెప్పిన లక్ష్మి పార్వతి మాటలు...

Lakshmi Parvathi:సీనియర్ ఎన్టీఆర్ మరణం కోసం వాళ్ళు ఎం చేశారో చెప్పిన లక్ష్మి పార్వతి మాటలు వైరల్..

lakshmi-parvathi-comments-about-sr-ntr-death-viral

Lakshmi Parvathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడుగా పేరు సంపాదించుకున్న దివంగత సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టం. రాముడు ఎలా ఉంటాడు? కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే అక్కడ రామారావు గారి ఫోటోని చూపించేవారు. చాలామంది ఇళ్లల్లో రాముడిగా, కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ ( Lakshmi Parvathi comments viral ) ఫోటోనే పెట్టుకొని ఉండేవారు. అంత గొప్పగా ఆ పాత్రలలో ఇమిడిపోయి అందరి మనసుల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు సీనియర్ ఎన్టీఆర్. ఆయన కెరీర్ పరంగా సినిమా రంగంలో ఎంత సక్సెస్ను సాధించారో రాజకీయంలో అడుగుపెట్టి అలాంటి సంచలనాలను క్రియేట్ చేశారు.

Lakshmi- Parvathi -comments-about-death

కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం అని మొదలుపెట్టిన ఆయన పథకం ఆ రోజుల్లో తెలుగువారి మనసుల్లో ఆయనపై అపారమైన గౌరవం, ప్రేమ పెంచేశాయి. రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ( Lakshmi Parvathi comments viral ) నిలదొక్కుకొని ఎప్పటికీ ఆయన పేరు గుర్తుంచుకునేలా చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారి భార్య చనిపోయిన తర్వాత కొంతకాలం రాజకీయాల్లో ఉండి ఆయన చివరకు వయసు మీద పడిన తర్వాత లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కారణం అడిగితే.. నాకు చాలా సేవ చేసిందని అందుకే చేసుకున్నాను అని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారు.

See also  NTR Lover: ఏంటి.? జూనియర్ ఎన్టీఆర్ లవర్ వివాహనికి ముందే గర్భవతి అయ్యిందా.? ఇందులో నిజం ఎంత..

Lakshmi- Parvathi -comments

లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి ఆయన చనిపోవడం జరిగింది. అయితే లక్ష్మీపార్వతి ఇప్పటికీ ఎన్టీఆర్ గారి భార్యగా ఉంటూ ఆమె నారా కుటుంబం నందమూరి కుటుంబంలో వాళ్లపై అనేక కామెంట్లు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల నారా చంద్రబాబునాయుడు ని అరెస్టు చేసిన సంగతి మనందరికీ ( Lakshmi Parvathi comments viral ) తెలిసిందే. తర్వాత లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆయన కోడలు ఇద్దరు కూడా బస్సు ప్రయాణం మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

See also  అందమే అసూయ పడుతుంది అనసూయ అందం ముందు

Lakshmi- Parvathi -comments

నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ని దృష్టిలో పెట్టుకొని లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. నీకు ఎన్ని సంవత్సరాలకు నీ తండ్రి ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారో.. అసలు నీలాంటి కూతురు దొరకడం ఆయన దురదృష్టకరం.. నీ భర్త , కొడుకు సీఎంలు అయిపోవాలని కోరుకుంటూ.. నీ తండ్రి చావు కోసం క్షుద్ర పూజలు ఆ గుడిలో చేయించావని ఎవరికి తెలియదు. నీకు నిజంగా నీ తండ్రి మీద ప్రేమ ఉంటే నీ భర్త చేసిన అవినీతులన్నీ బయటపెట్టి.. ఆయన పేరుని నిలబెట్టు. హెరిటేజ్ లెక్కలను బయట పెట్టు. నీలాంటి కూతురు ఎన్టీఆర్ గారికి పుట్టడం నిజంగా బాధాకరం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు.. రామారావు గారు బ్రతికి ఉండగా.. చంద్రబాబు నిజస్వరూపం గురించి ఆయన చెప్పిన వీడియో తో పాటు.. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.