Krithi Shetty Love: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలి చిత్రంతోనే కొంతమంది హీరోలైన, హీరోయిన్లైనా రాత్రికి రాత్రే స్టార్ హీరో హీరోయిన్లుగా మారిపోతుంటారు. మరి కొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాక వాళ్ళు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ల సినిమాలు హిట్ అవ్వక ఫ్లాప్ హీరోయిన్ గానే ముద్ర వేసుకుంటారు. ఇక వాళ్లందరి విషయం పక్కకు పెట్టినట్లయితే తన మొదటి సినిమా తోటే టాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుని తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేస్తుంది అనుకున్నారు. అలా అందరూ అనుకున్నట్టే ఆమె వరుసగా నటించిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ హీరోయిన్ కి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇలా వరుస సినిమాలు హిట్ అయిన తర్వాత వరుస ఆఫర్లతో చాలా బిజీ బిజీగా ఎన్నో చిత్రాల్లో అవకాశాలు లభించడంతో మళ్ళీ వరుసగా వచ్చిన మూడు చిత్రాల్లో నటించింది. కానీ అవి అనుకున్నంత ఫలితాన్ని కాదు కదా అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల మరొకచిత్రం విడుదల అయింది. ఆ చిత్రం కూడా ఆ ఫ్లాప్ దిశగానే అడుగులు వేస్తుంది. ఈ విషయం చెప్తుంటేనే మనకు అర్థమయిపోయి ఉండాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృత్తి శెట్టి అని.. ఆ సినిమాతో తన అందచందాలతో పాటు తన నటన కూడా ప్రదర్శించి ఇట్టే అందరితో ఆకట్టుకున్న బ్యూటీ.. ఆ తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో అదరగొట్టినది కృత్తి శెట్టి.
కానీ మూడు సినిమాలు హిట్ అయిన తర్వాత అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడో స్టార్ హీరోయిన్ హోదా దక్కిందని అందరి అనుకున్నారు. కానీ ఆ తర్వాత నటించిన మూడు సినిమాల్లో ఒకటి కూడా ఆమెకు విజయాన్ని ఇవ్వలేక పోయాయి. ఇక ఆ తర్వాత ఇటీవల విడుదలైన కస్టడీ సినిమా కూడా ఈమె తన విజయాన్ని నిరూపించుకోలేకపోయింది. అప్పుడు గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఇదిలా ఉన్నప్పుడు కస్టడి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తన ప్రేమ గురించి తను ఎవరిని ప్రేమిస్తున్న అన్న విషయం గురించి బయట పెట్టింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తను యాంకర్ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడగగా.. కృతి శెట్టి చాలా తెలివిగా నేను (Krithi Shetty Love) సినిమాలతో ప్రేమ షూటింగ్ లతో డేటింగ్ చేస్తానంతే.. నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు.. నా తల్లిదండ్రులను తప్ప.. అంటూ తెలిపింది. ప్రేమ చాలా స్వచ్ఛమైనది కానీ ఇప్పటివరకు నేను పొందిన ప్రేమ నా తల్లిదండ్రుల నుంచి పొందిన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే.. కానీ నేను చదువుకునే రోజుల్లో చాలా లవ్ లెటర్స్ వచ్చాయి కానీ నేను వాటిని అంతగా పట్టించుకునే దాన్ని కాదు అంటూ కృతి శెట్టి తన ప్రేమ విషయాన్ని ఇంటర్వ్యూలో భాగంగా బయట పెట్టింది.