Janhvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా దేవర. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ( Janhvi Kapoor and Koratala Shiva ) భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక వినూత్నమైన క్యారెక్టర్ తో ప్రత్యేకంగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తాయని.. సినిమా ఖచ్చితంగా ఒక సంచలనాన్ని సృష్టిస్తుందని అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ సినిమాకి మరొక ప్రత్యేకత అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డెబ్యూ ఇవ్వబోతుంది. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి ఎన్నో సినిమాలను చూసి తెలుగు సినీ అభిమానులు ఎంతగా ఎంజాయ్ చేశారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ వారసులు ఇద్దరు కలిసి నటించబోతుంటే.. అందరూ ( Janhvi Kapoor and Koratala Shiva ) ఆనందంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ జంట ఎలా ఉంటుంది? అప్పటి సినిమా పాటల్లో ఎన్టీఆర్ శ్రీదేవి సంబంధించిన ఏదైనా ఒక పాటని సినిమాలో పెడతారా?వీళ్ళిద్దరూ అలా నటిస్తారా? అప్పుడు అందరికీ మళ్లీ సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవిని చూసినంత ఆనందం కలుగుతుందా అంటూ ఎన్నో రకాలుగా ఎందరో ఏవేవో ఆలోచిస్తూనే ఉన్నారు.
అయితే కొరటాల శివ దర్శకత్వ తీరు, ఆయన ఆలోచన విధానం ఏది మంచిది అనిపిస్తే ఆయన అటువైపుగా దూసుకుపోతారు. చివరికి గెలుపు కోసమే అందరూ పోరాడుతారు. జాన్వి కపూర్ కొరటాలకి దేవల సినిమాకి రిలేటెడ్ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జాన్వీకపూర్ సినిమాకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొరటాల శివ ( Janhvi Kapoor and Koratala Shiva ) ఆమెకు ఒక కండిషన్ పెట్టాడంట. ఆ కండిషన్ ఒప్పుకుంటే నేను సినిమాకు తీసుకుంటానని చెప్పాడంట. ఇంతకీ ఆ కండిషన్ ఏమిటంటే.. జాన్వి కపూర్ చాలా ట్రెడిషనల్ గా ఉండాలని.. చాలా ట్రెడిషనల్ లుక్ తో వేషధారణ.. నడక తీరు.. మాట అన్ని ఉండాలని.. అది బాగా ప్రాక్టీస్ చేయమని.. ఆ క్రమంగా ఉంటేనే దాని ట్రైల్ చూస్తేనే నేను చూజ్ చేసుకుంటానని కచ్చితంగా చెప్పాడంట.
జాన్వీ కపూర్ బయట ఎంత బోల్డ్ గా ఉంటుందో, ఎలాంటి బట్టలు వేసుకుంటుందో, ఎంత ఎక్స్పోజింగ్ లో ఉంటుందో మనం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. అలాంటి జాహ్నవి కపూర్ ని అలా కాకుండా ఇంకోలా మన తెలుగు వాళ్లకి నచ్చేలా.. శ్రీదేవి కూతురా అని మెచ్చేలా చూపించాలని కొరటాల అభిప్రాయం అని కచ్చితంగా అర్థమవుతుంది. అందుకే కొరటాల కండిషన్ కి జాన్వి కపూర్ ఒప్పుకొని ఆమె ట్రెడిషనల్ లుక్ లో చూపించి అన్ని ఓకే అనుకున్న తర్వాత ఆమె సెలెక్ట్ అయిందంట. అయితే జాన్వికపూర్ శుభ్రమైన బట్టలు వేసుకొని, నిండుగా తెలుగు అమ్మాయిల కనిపించేలా కొరటాల చూపించాలనుకోవడం నేటిజనులకు ఎంతగానో నచ్చింది. దానికి జాన్వి ఒప్పుకోవడం కూడా ఇంకా బాగా నచ్చింది..